అసెంబ్లీ ఆవరణలో లోకసత్తా నేత జయప్రకాష్ నారాయణపై తెరాస దాడి
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం ముగిసిన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణపై గురువారం దాడి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు అరవింద రెడ్డి జెపిపై చేయి చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు జెపితో ఘర్షణకు దిగారు. జెపి కింద పడిపోయారు. హరీష్ రావును శాసనసభ మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ సంఘటనలో హరీష్ రావుకు గాయాలయ్యాయి.
జెపిని తాము అడ్డుకోలేదని, మీడియా పాయింట్ వద్ద ఎక్కువ సేపు మాట్లాడుతుంటే వారించే ప్రయత్నం చేశామని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు స్పష్టం చేశారు. కాంగ్రెసు ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావుపై కూడా దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. పాలడుగు వెంకటరావు కూడా గాయపడ్డారు. ఈ సంఘటనలతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
Loksatta MLA Jayaprakash Narayana was attacked at media point in Assembly premises. It is alleged that TRS MLA Aravind Reddy manhandled JP. But, TRS MLA KTR condemned those allegations.
Story first published: Thursday, February 17, 2011, 12:18 [IST]