జెపిపై దాడి చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయి: నాదెండ్ల
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై దాడి చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని శాసనసభ స్పీకరు నాదెండ్ల మనోహర్ శుక్రవారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. జెపిపై దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. దాడి చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డ్రైవర్ మల్లేష్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లుగా సభలో ప్రకటించారు. ఎమ్మెల్యేలపై విచారణ జరిపిస్తామన్నారు. విచారిస్తామన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, జెపిపై ఎమ్మెల్యేల దాడి బాధాకరమన్నారు. గురువారం నాటి సంఘటనలు అసెంబ్లీ ఖండిస్తుందని చెప్పారు. ఈ సభ ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటిదని, సభలో అందరూ సంశయమనంతో మెలగాలని అందరూ సభ సజావుగా సహకరించాలని కోరారు.
సభలో ఉన్న వారి పని తీరు అందరికీ ఆదర్శంగా ఉండాల్సి ఉండాలన్నారు. సభ యొక్క ప్రాముఖ్యతను కాపాడాల్సిన బాధ్యతకు అందరికీ ఉందన్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నిన్నటి ఘటనలో శాసనమండలి చైర్మన్ చక్రపాణి కూడా గాయపడ్డారన్నారు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అందరికీ ఉందని, కొందరి ప్రవర్తన సరిగా లేదన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్స్‌పై 22న స్వల్ప వ్యవధి చర్చ ఉంటుందని, ఇప్పటికే ప్రభుత్వం దానిపై ప్రకటన చేసిందన్నారు. సభా హక్కుల ఉల్లంఘనకు ఎవరూ పాల్పడినా నేరమే అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇలాంటి దుర్ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని అన్నారు.
Deputy Speaker Nadendla Manohar said that government will take action on MLAs, who attacked on Lok Satta
president Jayaprakash Narayana. He condemned attack on government also.
Story first published: Friday, February 18, 2011, 13:41 [IST]