తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీతో కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు

కాగా, కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తున్నారు. ఈ భేటీలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, అభ్యర్థుల ఖరారుపై మాట్లాడే అవకాశం ఉంది. అలాగే, తెలంగాణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ టికెట్లు ఆశిస్తున్న కాంగ్రెసు నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, వారు ఎక్కువగా కిరణ్ కుమార్ రెడ్డి కలవడం లేదు. ఆయన చేతుల్లో ఏమీ లేదనే ఉద్దేశంతో అధిష్టానం నాయకులకు దగ్గరగా ఉండే నాయకులతో పైరవీలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications