హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్క వోటు కోసం 12మంది సిబ్బంది, ఎంపీ ఝాన్సీ ఓటు గల్లంతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Jhansi
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని నల్లకుంట బూత్ నంబర్ 160లో ఒకే ఒక్క ఓటు కోసం ఎనిమిది మంది పోలీసులు, నలుగురు సిబ్బందిని నియమించడం గమనార్హం. ఆదివారం రాష్ట్రంలోని మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు శాసనమండలి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నల్లకుంటలోని 160వ బూత్ నంబర్‌లో ఒకే ఒక్క ఓటు కోసం మొత్తం 12మంది సిబ్బంది ఉండటం గమనార్హం. కాగా వీటి కోసం 71 మంది బరిలో నిలిచారు.

కాగా రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా ఉపాధ్యాయ ఎన్నికలలో 38.33 శాతం ఓట్లు, కడప, కర్నూలు, అనంతపురం ఉపాధ్యాయ ఎన్నికలలో 56.6 శాతం, చిత్తూరు, ఒంగోలు, ఎస్పీఎస్ నెల్లూరు ఉపాధ్యాయ ఎన్నికలలో 37.2 శాతం ఓటింగ్ జరిగింది. కడప, కర్నూలు, అనంతపుర్ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో 22 శాతం, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరంలో 27 శాతం ఓటింగ్ జరిగింది. కాగా పలువురు ముఖ్యనేతల ఓట్లు గల్లంతయ్యాయి. విజయనగరం పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్నీ ఓటు గల్లంతయింది.

English summary
Vijayanagaram MP Botsa Jhansi vote disappeared in MLC election today. Three graduate and three teachers MLC 
 
 elections held today. 71 members contested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X