సత్యజిత్‌తో నాకు విభేదాలు లేవు: బాబా సోదరుడి తనయుడు రత్నాకర్
State
oi-Nageshwara Rao M
By Nageswara Rao
|
అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చికిత్స వివరాలు వెల్లడించటం చట్ట విరుద్దమని ట్రస్టు సభ్యులు గురువారం ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. బాబాకు చికిత్సపై ఎవరూ సలహాలు ఇవ్వలేదన్నారు. ఏ వైద్యం కావాలో బాబానే భక్తులకు సత్యసాయిబాబానే చెప్పేవారన్నారు. డాక్టర్లు సూచించినట్టుగా జాగ్రత్తలు తీసుకునే వారన్నారు. ఆసుపత్రిలోని వీడియోలను బహిర్గత పరచక పోవడంలో తప్పు లేదన్నారు. బాబా అనుమతి లేకుండా వీడియోలను విడుదల చేయడం కుదరదని స్పష్టం చేశారు. ట్రస్టు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదని చెప్పారు. సత్యజిత్ కేవలం బాబా వ్యక్తిగత సహాయకుడే కానీ మరెంతో ప్రధాన్యత ఆయనకు లేదని చెప్పారు.
సత్యజిత్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదని బాబా సోదరుడి తనయుడు రత్నాకర్ స్పష్టం చేశారు. బాబా వ్యక్తిగత సహాయం కోసమే సత్యజిత్ నియమించబడ్డారని చెప్పారు. ఇరవయ్యేళ్లుగా సత్యజిత్ బాబా సేవలోనే ఉన్నారని చెప్పారు. సత్యజిత్‌కు తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. బాబా స్వయంగా డాక్టర్లను ఎంచుకొని వైద్యం చేయించుకునే వారని చెప్పారు. ట్రస్టులోకి సత్యజిత్‌ను తీసుకునే ఆలోచన జరగలేదని మద్రాసు శ్రీనివాసన్ చెప్పారు. సత్యజిత్ వల్ల ఏదైనా లోపం జరిగితే సత్య సాయి బాబానే వెనక్కి పంపించి ఉండేవారని ఆయన అన్నారు.