తెలుగు సినీ నిర్మాత సింగనమల రమేష్ ఇంట్లో సిఐడి సోదాలు

సింగనమలకు రెండు బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు గుర్తించామని, కోర్టు అనుమతితో లాకర్లను తెరిసి పరిశీలిస్తామని ఆయన చెప్పారు. సింగగనమల రమేష్‌ను వారెంట్‌తో హైదరాబాద్ తరలిస్తామని ఐజీ తెలిపారు. కాగా మద్దెలచెరువు సూరి హత్యకేసులో నిందితుడు భాను కదలికలపై మహారాష్ట్రలో ఆరా తీస్తున్నామని ఆయన వెల్లడించారు.
కాగా, చెన్నైలో అరెస్టయిన సినీ నిర్మాత శింగనమల రమేశ్‌ను సోమవారం హైదరాబాద్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. చీటింగ్, బెదిరింపుల అభియోగాలపై రమేశ్‌ను సీఐడీ పోలీసులు శుక్రవారం చెన్నైలో అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అనుమతితో అతన్ని హైదరాబాద్ తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. శనివారం సాయంత్రం కానీ ఆదివారం ఉదయం కానీ హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉందని, సోమవారం ఇక్కడి సీఐడీ కోర్టులో ప్రవేశపెడతామని సీఐడీ అధికారులు తెలిపారు.