వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్ ముక్కలకు ఒప్పుకోం: సీమాంధ్ర నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sailajanath-Kavuri Sambhasiva Rao
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని తాము అంగీకరించబోమని సీమాంధ్ర నాయకులు స్పష్టం చేశారు. పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశమైన అనంతరం సీమాంధ్ర నేతలు సోమవారం మీడియా సమావేశంలో కుండబద్దలు కొట్టి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. కావూరి సాంబశివరావు, మంత్రులు శైలజానాథ్, టిజి వెంకటేష్, శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి తదితరులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కావూరి నివాసంలో జరిగిన సమావేశంలో జరిగిన సమావేశంలో మంత్రులు టిజి వెంకటేష్, శైలజానాథ్, ఆనం రామనారాయణ రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, అహ్మదుల్లా, శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్రపై తమ పార్టీ సీమాంధ్ర నాయకులు ఏకాభిప్రాయంతో ఉన్నారని, వ్యక్తిగత కారణాల వల్ల, అందుబాటులో లేకపోవడం వల్ల కొంత మంది రాలేకపోయారని కావూరి సాంబశివరావు చెప్పారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరో ప్రతిపాదనను అమలు చేయాలని సీమాంధ్ర నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా విభజన ఉద్యమాలు వస్తాయని వారు హెచ్చరించారు. రాష్ట్రాన్ని కూడా ముక్కలు చేయాల్సి వస్తుందని వారన్నారు. దళిత ఆంధ్రప్రదేశ్, సామాజిక తెలంగాణ, గిరిజన రాష్ట్రం ఏర్పాటు వంటి డిమాండ్లు తలెత్తుతాయని వారన్నారు. సమైక్యరాష్ట్రంలోని అభివృద్ధి సాధ్యమవుతుందని వారన్నారు. వేర్పాటువాదుల ఒత్తిళ్లకు తలొగ్గవద్దని వారు పార్టీ అధిష్టానాన్ని కోరారు. తమ వాదనలు వినిపించడానికి ఈ రోజు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను, రేపు కేంద్ర మంత్రులు చిదంబరాన్నీ ప్రణబ్ ముఖర్జీనీ కలుస్తామని, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కూడా కలుస్తామని వారు చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు తర్వాత 2009 డిసెంబర్ 9వ తేదీ ప్రకటనకు అర్థం లేదని వారన్నారు.

English summary
Seemandhra leaders clarified that they will not accept for the division of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X