కరీంనగర్: భార్యపై అనుమానంతో ఆమెను కడతేర్చిన సంఘటన కరీంనగర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా రామగుండంలో సతీష్ అనే వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఆమె తలపై రాడుతో బాది హత్య చేశాడు. వీరికి ఏడేళ్ల క్రితం వివాహం అయింది. కొంతకాలం సంసారం సాఫీగానే సాగినప్పటికీ ఆ తర్వాత సతీష్ తన భార్యను నిత్యం వేధించేవాడు.
ప్రతిరోజు ఆమెను భర్త చిత్రహింసలకు గురి చేసేవాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు సైతం జరిగాయి. పంచాయతీ పెద్దలు పలుమార్లు భర్తను మందలించారు. వారికి ఓ సంతానం సైతం ఉంది. భార్యను చంపిన అనంతరం సతీష్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.