వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వం తీరే నచ్చలేదు, మూల్యం చెల్లిస్తారు: గుత్తా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gutta Sukhendar Reddy
హైదరాబాద్: ప్రభుత్వం తీరు తమకు నచ్చలేదని చెప్పినప్పుడు ఇక మంత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముందని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం అన్నారు. రైలు రోకోలో పాల్గొని కరీంనగర్, వరంగల్ జిల్లాలలో అరెస్టయిన ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, సీనియర్ నేత జీవన్ రెడ్డి తదితరులను పరామర్శించేందుకు వారు హైదరాబాదు నుండి బయలు దేరి వెళ్లారు. మొదట కరీంనగర్ ఆ తర్వాత వరంగల్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా గుత్తా, కె కేశవ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం త్వరలో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కేంద్రం తెలంగాణ ఇవ్వకపోతే ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

రైలు రోకోలో పాల్గొన్న ఉద్యమ నేతలపై రైల్వే యాక్టు ప్రకారం కేసులు పెట్టడంపై ఆ శాఖ మంత్రిని కలుస్తామని చెప్పారు. బెయిలు మంజూరుపై తమ ఎంపీలను ఒప్పిస్తామన్నారు. సమ్మె విరమింప చేసే బాధ్యతతో పాటు తెలంగాణ తీసుకు వచ్చే బాధ్యత కూడా తెలంగాణ మంత్రుల పైనే ఉందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే తాము రైలు రోకోలో పాల్గొంటున్నామన్నారు. అరెస్టులు, కేసులతో ఉద్యమాన్ని అణచలేరన్నారు.

English summary
MP Gutta Sukhendar Reddy unhappy with state government attitude. He warned centre that congress will disappears in Telagnana if not give state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X