వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంట తిరిగిన వాళ్లే నిందలేస్తున్నారు: జగన్ ఆవేదన

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన వెంట తిరిగినోళ్లే ఇప్పుడు ఆయనపై నిందలు వేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఓదార్పుయాత్రలో ఆవేదనతో అన్నారు. ఆదివారం ఆయన ఆరెపల్లి, జొన్నలగడ్డవారిపాలెం తదితర గ్రామాల్లో వైయస్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు అలనాటి శ్రీరాముని పాలన చూడకున్నా నేటి వైయస్ పాలన చూశారన్నారు. తన ప్రజా సంక్షేమ పథకాలతో ఆయన చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు.

తనకు మద్దతుగా వచ్చిన వారందరికీ ఆయన పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. దివంగత వైయస్ ప్రతిష్ట దిగజార్చేందుకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కైందని ఆరోపించారు. ఇద్దరూ కలిసి కోర్టుల దాకా వెళ్లి వైయస్ ప్రతిష్ట దిగజార్చాలని చూస్తున్నారన్నారు. ఇందుకోసం కాంగ్రెసు చంద్రబాబు నాయుడుతో కలిసి తమ వద్ద ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కలిసికట్టుగా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ అధికార, ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదన్నారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy accused that Congress leaders blaming his family who close to late YSR when he live.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X