హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్పీకర్‌ను కలవం, నేరుగా ప్రజాక్షేత్రానికే: జగన్‌ వర్గం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pilli Subhash Chandra Bose-Shobha Nagi Reddy
హైదరాబాద్: అనర్హత వేటు విషయంలో తాము గతంలోనే స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసినందువల్ల మరోసారి కలవకూడదని నిర్ణయించుకున్నామని, ప్రజాక్షేత్రంలోనే తాము తేల్చుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు బుధవారం చెప్పారు. అనర్హత వేటు విషయంలో 18వ తేది నుండి 21వ తేది మధ్య జగన్ వర్గానికి చెందిన పదిహేడు మంది శాసనసభ్యులు స్పీకర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ విషయమై ఎమ్మెల్యేలు ఉదయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం పిల్లి సుభాష్ చంద్ర బోస్, శోభా నాగి రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము గతంలోనే స్పీకర్ ఎదుట హాజరయ్యామని మరోసారి హాజరు కావొద్దని నిర్ణయించుకున్నామని చెప్పారు. గతంలోనే చెప్పాల్సిందంతా చెప్పామని, మళ్లీ విడివిడిగా పిలవడమేమిటన్నారు.

రాజీనామా, అనర్హత వేటు విషయాన్ని స్పీకర్ విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. స్పీకర్ మా రాజీనామాలు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజారాజ్యం పార్టీ అనేది లేనప్పుడు తాను ఎవరికి వివరణ ఇస్తానని శోభా నాగి రెడ్డి ప్రశ్నించారు. చిరంజీవి పిఆర్పీ అధినేతగా ఉంటే తాను వివరణ ఇచ్చేందుకు సిద్ధమన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రైతులపై ప్రేమతో అవిశ్వాసం పెట్టలేదని తమను ఇబ్బందులకు గురి చేసేందుకే పెట్టారన్నారు. జగన్‌ను ఎదుర్కోలేక బాబు కాంగ్రెసు చేతులు కలిపాయన్నారు. తన ఆస్తులపై సిబిఐ విచారణ వేస్తే హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్న బాబుకు ఇతరుల అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కాగా భేటీ సమయంలో గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్‌తో ఎమ్మెల్యేలు పలుమార్లు ఫోన్లో చర్చించారు. సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలకు నిర్ణయాన్ని ఫోన్ ద్వారా తెలిపారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy camp mlas said that they will not meet speaker Nadendla Manohar in Disqualification issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X