రష్దీ ప్రాణాలకు ముప్పున్నట్లు తెలియదన్న పోలీసులు

రాజస్థాన్ పోలీసులకు ఏమైనా సమాచారం ఉందేమో, వారు రష్దీకి ఆ సమాచారం అందించారేమో తమకు తెలియదని ఆయన అన్నారు. జైపూర్‌కు వస్తే హత్య చేసేందుకు ముంబై అండర్ వరల్డ్ కిరాయి హంతకులు ఏర్పాట్లు చేసుకున్నట్లు తనకు మహారాష్ట్ర, రాజస్థాన్ నిఘా వర్గాలు తెలిపినట్లు సల్మాన్ రష్దీ చెప్పారని జైపూర్ సాహిత్య ఉత్సవ నిర్వాహకుడు సంజయ్ కె. రాయ్ శుక్రవారం చెప్పారు. రష్దీ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు తమకు ఏ విధమైన సమాచారం లేదని ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ అధికారులు అంటున్నారు.
రష్దీకి మత ఛాందసవాదుల నుంచి ముప్పు ఉందే గానీ అండర్ వరల్డ్ నుంచి లేదని పోలీసు అధికారులు అంటున్నారు. రష్టీ హత్యకు మత ఛాందసవాదులు కిరాయి హంతకులను కుదుర్చుకున్నారని చెప్పలేమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications