వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు కిరణ్ అవగాహన, 'చిరు'వర్గంలోనే ఆశ్చర్యం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు ఓ అవగాహనతో ముందుకెళుతున్నారా అంటే అవుననే అంటున్నారు కొందరు. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కైందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకం కూడా చంద్రబాబు, కిరణ్ ఓ అవగాహనతో ముందుకు వెళుతున్నారనేందుకు మంచి ఉదాహరణ కొందరు ఆరోపిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కోసం నియమించిన ఎనిమిది మంది కమిషనర్లలో విజయ నిర్మల ఒకరు. ఆమెను చంద్రబాబే సూచించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన సూచన మేరకే విజయ నిర్మల నియామకం జరిగిందని అంటున్నారు. ఈమె గత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున నూజివీడు నుండి పోటీ చేసి ఓడిపోయారు. పిఆర్పీ విజయవాడ రూరల్ అధ్యక్షురాలిగా పని చేశారు. ఈమెను చిరంజీవి ప్రతిపాదించక పోయినప్పటికీ కమిషనర్‌గా నియమించడం పట్ల ఆయన వర్గాన్నే ఆశ్చర్యానికి గురి చేసిందట.

అయితే వారి వాదనలను మరికొందరు కొట్టి పారేస్తున్నారు. బాబు కిరణ్ మధ్య అలాంటి అవగాహన ఏమీ లేదంటున్నారు. కొందరు కావాలనే టిడిపిపై బురద జల్లేందుకు ఇలాంటి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు కేవలం ఐపిఎస్ ఎం.రతన్, ఆంధ్రప్రభ సంపాదకులు విజయ బాబు పేరును మాత్రమే సూచించారని, విజయ నిర్మల పేరును ప్రతిపాదించలేదని అంటున్నారు. అయినా ఆమె పిఆర్పీ నేత అని, అలాంటి వారిని ప్రతిపాదించాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరోవైపు పార్టీలోని సిఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకులే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని కిరణ్ అనుచర కాంగ్రెసు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట.

English summary
The allegations came out that TDP chief Nara Chandrababu Naidu proposed Vijaya Nirmala name as commissioner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X