తులసి మొక్కలా పెరుగుదామని నాచెల్లితో చెప్పా: జగన్

పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే సుచరిత గొప్ప పని చేసి ఇవాళ మీ ముందు నిలబడిందన్నారు. అవిశ్వాసానికి ముందు సుచరిత హైదరాబాద్ వెళ్తున్నప్పుడే తాను ఆమెతో... టిడిపి ఏ ఉద్దేశ్యంతో అవిశ్వాసం పెట్టినా విలువలు, విశ్వసనీయత ఉండాలని సూచించానని అన్నారు. రైతులు కష్టాలు పడుతున్నారు, పేదలు కన్నీళ్లు పెడుతున్నారని వీరికి తోడుగా నిలబడదామని ఆమెతో అన్నానని చెప్పారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మనం తులసి మొక్కగా పెరుగుదామని నా చెల్లి సుచరితకు చెప్పానని అన్నారు. డిస్ క్వాలిఫై అవుతామని తెలిసినప్పటికీ ప్రజల బాధలు ఢిల్లీ పెద్దలకు తెలిసి రావాలనే అవిశ్వాసానికి మద్దతిచ్చామన్నారు.












Click it and Unblock the Notifications