వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టులనూ ఎన్డీ తివారీకి చుక్కెదురు

By Pratap
|
Google Oneindia TeluguNews

ND Tiwari
న్యూఢిల్లీ: పితృత్వం కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీకి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. పితృత్వం కేసులో డిఎన్ఎ పరీక్ష నిమిత్తం రక్తం నమూనాను ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం ఎన్డీ తివారీని ఆదేశించింది. ఎన్డీ తివారీ డిఎన్ఎ పరీక్ష కోసం రక్తం నమూనాను ఇవ్వాల్సిందేనని, అవసరమైతే పోలీసు సహాయం తీసుకుని బలవంతంగా తివారీ రక్తాన్ని తీసుకోవాలని హైకోర్టు శుక్రవారం తెలిపింది.

తాను తివారీకి పుట్టానని చెబుతున్న రోహిత్ శేఖర్ రక్తం నమూనాల కోసం తివారీని బలవంతం చేయవద్దని సింగిల్ జడ్డీ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. నాలుగు వారాల్లో ఎన్డీ తివారీ రక్త నమూనాను ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. రోహిత్ శేఖర్ అనే యువకుడు - తివారీని తన తండ్రిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేశాడు. తన తల్లి ఉజ్వల శర్మతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న తివారీకి తాను జన్మించానని అతను వాదిస్తున్నాడు.

దాంతో ఎన్డీ తివారీకి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అయితే, పితృత్వ పరీక్షలకు తివారీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అది తన ప్రైవసీని దెబ్బ తీసే చర్య అని ఆయన అభివర్ణిస్తున్నారు. తివారీకి పితృత్వ పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ హైకోర్టు నిరుడు డిసెంబర్‌లో జారీ చేసింది.

తివారీయే తన అసలు తండ్రి అని వాదిస్తున్న రోహిత్ శేఖర్ (31), ఆయన తల్లి ఉజ్వల ఇంతకు ముందు మరో వైపు నుంచి నరుక్కొచ్చారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ, ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో ఉజ్వల భర్త బీపీ శర్మకు డీఎన్ఏ పరీక్షలు జరిపించారు. ఈ నివేదికను సీల్డ్ కవర్‌లో ఢిల్లీ హైకోర్టుకు సమర్పించారు. నివేదికను జస్టిస్ రేవా ఖేత్రపాల్ కోర్టులో చదివి వినిపించారు.

రోహిత్ డీఎన్ఏ తల్లి ఉజ్వలతో సరిపోలుతోందని, ఆమె భర్త బీపీ శర్మతో సరిపోలడంలేదని తెలిపారు. దీంతో ఉజ్వల, బీపీ శర్మల బంధం వల్ల రోహిత్ జన్మించలేదని రుజువైంది. 'తివారీయే నా తండ్రి' అన్న రోహిత్ వాదనకు బలం చేకూరింది.

English summary
The Supreme Court on Tuesday asked Congress leader N D Tiwari to provide blood samples for DNA test in the paternity test case.The Delhi high court on Friday had said that ND Tiwari could be compelled to give blood sample.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X