వేరే కులస్థుడిని ప్రేమించిందని చెల్లిని చంపిన అన్న

Posted By:
Subscribe to Oneindia Telugu
Kadapa District
కడప: జిల్లాలో ఘోరం. పరువు హత్య జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులకి వచ్చింది. కడప జిల్లాలోని చాపాడు మండలం నెరవాడలో ఓ సోదరుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ప్రియుడితో పెళ్లి జరిపించాలని కోరిన తన సోదరిని హత్య చేసి పూడ్చి పెట్టాడు. పదహారు రోజుల క్రితమే ఈ సంఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికంగా ఉండే గంగన్న సోదరి లలిత చాపాడులో వ్యవసాయ విస్తరణ అధికారి(ఎఈవో)గా పని చేస్తోంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని తండ్రిని, తన సోదరుడిని కోరింది. వేరే కులస్థుడితో పెళ్లికి అంగీకరించని అన్న సోదరిని దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని కుందూ నదిలో పూడ్చి పెట్టాడు.

లలిత కొద్ది రోజులుగా కనిపించక పోవడంతో గాలింపు చేపట్టిన స్థానికులు, బంధువులు చివరకు సోదరుడు చేసిన దారుణాన్ని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకిదిగిన పోలీసులు మృతదేహం కోసం వెతుకులాట ప్రారంభించారు. చాపాడు నెరవాడ ప్రాంతంలోనే కుందూ నదిలో పోలీసులు ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు.

మృతురాలి సోదరుడు గంగన్నను, మరో బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లలిత అదే జిల్లాలో చాగలమర్రిలో ఏఈవోగా పని చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పరువు హత్యలు చాలా జరుగుతాయి. మన రాష్ట్రంలో పరువు హత్య చోటు చేసుకోవడం అందరినీ కలిచి వేస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A brother killed his sister for loving other caste boy. Lalitha, who worked as AEO in Kadapa district was killed by her brother. She was loved one young and asked her brother about marriage. But brother did not accepted.
Please Wait while comments are loading...