హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరెంట్ ఆదాకు సిఎం చిట్కా, అధిగమిస్తామని ధీమా

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: విద్యుచ్ఛక్తి ఆదాకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి చిట్కాలు చెప్పారు. టీవీ చూడని సమయంలో స్విచాఫ్ చేస్తే పది శాతం విద్యుత్తు ఆదా అవుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్తు సంక్షోభాన్ని త్వరలోనే అధిగమిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొనుగోలు చేద్దామన్నా విద్యుత్తు అందుబాటులో లేదని, దాంతో కరెంట్ కష్టాలు వచ్చాయని ఆయన అన్నారు. సంప్రదాయేతర వనరులపై ప్రజలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

వచ్చే 50 ఏళ్లలో బొగ్గు కొరత ఉంటుందని, అందువల్ల సోలార్, విండ్, బయోమాస్ నుంచి విద్యుత్తు ఉత్పత్తికి కృషి చేస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో 2.20 కోట్ల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయని, అందులో 35 లక్షలు విద్యుత్తు కనెక్షన్లు అని, కరెంట్ సిబ్సిడీ కింద్ రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఇదిలావుంటే, జీవ వైవిధ్య సదస్సుపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సదస్సు ఏర్పాట్లు, హైదరాబాద్ సుందరీకరణ తదితర అంశాలపై ఆయన మంత్రులు, ఉన్నతాధికారులోత సమీక్షించారు. సృష్టిలో ఉన్న పర్యావరణ వ్యవస్థ సమతౌల్యంగా ఉండేలా చూడడంతో పాటు భూమిపై ఉన్న జీవరూపాలన్నింటి పరిరక్షణే లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి చేస్తున్న కృషిలో భాగంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్ హైటెక్స్‌లో 11వ అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సును నిర్వహిస్తున్నారు.

2011 - 2012 వరకు జీవ వైవిధ్య దశాబ్దంగా ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. గత 60 ఏళ్లలో ఈ తరహా సదస్సును భారతదేశం నిర్వహించడం ఇదే తొలిసారి. దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 194 దేశాలకు చెందిన 8 వేల మంది అతిథులు హాజరవుతున్నారు.

English summary
CM Kiran Kumar Reddy has started giving tips tp public to save power, as state is facing acute power shortage. He said that power crisis will be resolved soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X