అన్నాకు సూచన: బిజెపి వైపు కిరణ్ బేడీ చూపు

కిరణ్ బేడీ బిజెపిలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. అన్నా హజారే బృందం సభ్యురాలిగా కేంద్ర ప్రభుత్వం అవినీతిని కిరణ్ బేడీ తూర్పార బట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత అన్నా తన బృందాన్ని రద్దు చేసిన తర్వాత ఆమె బిజెపి వైపు చూస్తోందని చెబుతున్నారు.
మూడు రోజల క్రితం అన్నా బృందం మాజీ సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెసుతో పాటు బిజెపిని టార్గెట్ చేసుకొని ఆందోళన చేపట్టడాన్ని బేడీ తప్పు పట్టారు. బుధవారం కూడా అన్నా హజారేకు, యోగా గురువు రామ్ దేవ్ బాబుకు బిజెపితో కలిసి ఉద్యమించాలని సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా, బాబా బిజెపితో కలిసి సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేయాలని ఆమె పేర్కొన్నారు.
కుంభకోణాలతో యుపిఏ ప్రభుత్వం చిక్కుల్లో పడిందని, దీనిని అనుకూలంగా మలచుకొని అందరూ కలిసి ఉద్యమిస్తేనే ఫలితం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కూటమి ప్రజా గొంతుకగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అన్నా హజారే పార్టీ స్థాపించే ఉద్దేశ్యంలో భాగంగా తన బృందాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications