చెన్నారెడ్డికి నివాళులర్పించని కిరణ్‌రెడ్డి: మర్రి అసంతృప్తి

స్పీకర్ నాదెండ్ల మనోహర్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతా రెడ్డి, దానం నాగేందర్ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా నివాళులు అర్పించారు. నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఇందుకోసం మర్రి శశిధర్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానించారు. అయినప్పటికీ కిరణ్ మాజీ సిఎంకు నివాళులు అర్పించలేదు.
దీంతో మర్రి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నారు. చెన్నారెడ్డికి కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రిలు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సహా అందరూ ప్రతి వర్ధంతి రోజు నివాళులు అర్పించే వారని, కిరణ్ మాత్రం నిర్లక్ష్యం చేయడం సరికాదని మర్రి వర్గీయులు చెబుతున్నారు. వైయస్ సహా అందరూ విగ్రహం వద్దకు వచ్చి నివాళులు అర్పించే వారని గుర్తు చేస్కుంటున్నారు. ఇటువంటి వారి వల్లనే తెలంగాణకు ఆజ్యం పోసినట్లవుతుందని మర్రి వర్గీయులు కిరణ్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఏదో మనసులో పెట్టుకొని కిరణ్ ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉన్నందునే హాజరు కాలేదని ముఖ్యమంత్రి వర్గీయులు చెబుతున్నారు. కాగా గాంధీ భవనంలో మర్రి చెన్నారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బొత్స, కేంద్రమంత్రి చిరంజీవి తదితరులు నివాళులు అర్పించారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications