వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణతో ఆందోళనకు చెక్: అజిత్, తెరాసతో టిడిపి సై

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ajit Singh
న్యూఢిల్లీ/వరంగల్: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే కొద్ది రోజుల్లో ఆందోళనలు తగ్గుతాయని రాష్ట్రీయ లోకదళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ శుక్రవారం అన్నారు. కేంద్రం త్వరగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగినప్పటికీ అవి ఒకటి రెండు నెలల్లో తగ్గిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఇవ్వని పక్షంలో ఆందోళనలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు.

తెలంగాణ ఇస్తేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటు అనివార్యమని చెప్పారు. తెలంగాణ కోసం యూపిఏ భాగస్వామ్యపక్షాలు అన్నీ కలిసి కాంగ్రెసు పార్టీ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ రెండు ఏళ్లుగా తెలంగాణపై సంప్రదింపులు జరుపుతూనే ఉందని విమర్శించారు. ఈ అంశాన్ని త్వరగా తేల్చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

పార్టీనీ వీడేది లేదు: కెకె

తాము పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడే ప్రసక్తి లేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు అన్నారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తాను తొమ్మిదేళ్లుగా పార్టీలో ఉంటూ తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నామని చెప్పారు. కాగా కెకె అజిత్ సింగ్‌ను కలిసి తెలంగాణకు మద్దతివ్వాల్సిందిగా కోరారు.

కాంగ్రెసును భూస్థాపితం చేయడమే లక్ష్యం

కాంగ్రెసు పార్టీని భూస్థాపితం చేయడమే తమ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం ఫోరం చైర్మన్ ఎర్రబెల్లి దయాకర రావు వరంగల్ జిల్లాలో వేరుగా అన్నారు. తెలంగాణపై తేల్చకుండా నాన్చుతున్న కాంగ్రెస్సే తమ టార్గెట్ అన్నారు.

ఆ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి వేసేందుకు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సమితితో చేతులు కలుపుతామని చెప్పారు. సహకార ఎన్నికల్లో తాము తెరాసకు మద్దతిస్తామన్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

English summary
RLD chief Ajit Singh has blamed Central Government on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X