పేలుళ్లు: మాస్టర్‌మైండ్ మక్బూల్! సైకిళ్లక్కడే కొన్నారా?

దీంతో వారిని బుధవారం హాజరు పరచాలని వారెంట్లు జారీ చేస్తూ జైలు అధికారులకు జడ్జి మెహతా ఆదేశాలిచ్చారు. పుణె బాంబు పేలుళ్ల కేసులో గతేడాదిలోనే ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం వీరిద్దరినీ అరెస్టు చేసింది. అయితే, జైల్లోనుంచే హైదరాబాద్‌లో తమ ప్రణాళిక అమలుకు మక్బూల్ ప్రయత్నాలు చేశాడని వార్తలు వస్తున్నాయి. మక్బూల్ అరెస్ట్ కాకపోతే గత ఏడాది జూలైకి ముందే భయానక పేలుళ్లకు పాల్పడి ఉండేవాడని ఎన్ఐఎ తాజా విచారణలో వెలుగుచూసినట్లుగా తెలుస్తోంది.
దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలోనే పేలుళ్లు జరపాలని ఇండియన్ ముజాహిదీన్ ముఖ్యనేత యాసిన్ భత్కల్ ఆదేశించాడు. ఈ మేరకు అవసరమైన సహాయాన్ని కూడా ఏర్పాటు చేశాడు. దీంతో పేలుళ్లకు అనువైన ప్రాంతం కోసం పుణె పేలుళ్లకు ముందే తన బృందంతో మక్బూల్ రెక్కీ నిర్వహించాడట. జైలులో గత కొద్దిరోజులుగా జరుగుతున్న విచారణలో మక్బూల్ ఈ విషయాలు వెల్లడించాడు. అయితే జైలులో ప్రశ్నించేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో కస్టడీకి తీసుకోవాలని ఎన్ఐఎ అధికారులు నిర్ణయించారు.
మక్బూల్‌ను విచారిస్తే పేలుళ్లకు సంబంధించిన విషయం వెలుగులోకి వస్తుందని, ఇండియన్ ముజాహిదీన్ నేతలు యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్ ఎక్కడున్నారో, వారినుంచి సహకారం ఎలా అందుతుందో తదితర వాటికి సమాధానాలు దొరుకుతాయని ఎన్ఐఏ భావిస్తోంది. మరో ఉగ్రవాది ఇమ్రాన్‌ను కూడా రెండు రోజులపాటు జైల్లోనే విచారించారు. మరోవైపు బెంగళూరు, నాందేడ్, హుబ్లీ నగరాలకు కూడా ఎన్ఐఎ ఉన్నతాధికారులు దర్యాప్తు బృందాలను పంపారు.
ఈ ప్రాంతాల్లో ఒబెయిదుర్ రెహమాన్ అతనికి సన్నిహితుడిగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. గుజరాత్ హోం మంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో నిందితుడైన వ్యక్తికి ఇతను బంధువని గుర్తించారు. మక్బూల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తసీన్ అక్తర్ అలియాస్ మోనూ, వకార్ అలియాస్ అహ్మద్, తబ్రీజ్ అలియాస్ అసదుల్లా అక్తర్‌ల కోసం ఎన్ఐఎ అన్వేషిస్తోంది. యాసిన్ భత్కల్ సూచన మేరకు వీరేమైనా దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లలో పాల్గొన్నారా? అని అనుమానిస్తోంది.
యాసిన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. యాసిన్ సెల్‌ఫోన్‌లు వాడడని, ఇతరుల నంబర్లు గుర్తుంచుకునేందుకు మాత్రమే సెల్ వాడుతాడని గుర్తించినట్లుగా తెలుస్తోంది. రియాజ్ భత్కల్‌తో, అరెస్ట్‌కు ముందు మక్బూల్‌తో అతడు ఇంటర్‌నెట్ ఫోనీ, చాటింగ్‌ద్వారా మాట్లాడాడని ఎన్ఐఎ గుర్తించింది. కాగా, జంట పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఎన్ఐఏ ఐజీ లోక్‌నాథ్ బెహరా ఒక ప్రకటనలో తెలిపారు.
మరోవైపు బాంబు బ్లాస్టింగ్ కోసం ఉపయోగించిన సైకిళ్లను కొన్న దానిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. సైకిళ్లను ఉగ్రవాదాలు రాజధానిలోని జుమ్మెరాత్ బజారులో కొనుగోలు చేసి ఉంటారని భావిస్తున్నారు. అదే సమయంలో విడి భాగాలు కొని అమర్చే దిశలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications