ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో గవర్నర్ తమిళిసై అల్పాహారం: ప్రొటోకాల్ వివాదంపై

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత కొద్ది వారాలుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం బాసర ఆర్జేయూకేటీని సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆమె అల్పహారం తీసుకున్నారు.

ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను కలుసుకున్న గవర్నర్.. క్యాంపస్ లో కలియ తిరుగుతూ సమస్యలు తెలసుకు్నారు. క్యాంపస్ లో సరైన మెస్ సౌకర్యం లేదన్నారు. విద్యార్థులకు మంచి, పౌష్టికాహారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో చాలా సమస్యలున్నాయని తెలిపారు.

 Telangana governor visits Basara IIIT: meets students.

సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో.. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థులు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు ఇవ్వడం లేదని గవర్నర్ చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. బాసర ట్రిపుల్ ఐటీకి తరచూ గవర్నర్ రావాలని విద్యార్థులు కోరుతున్నారని చెప్పారు. కాగా, బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల కలుషిత ఆహారం తిని 500 మందికిపైగా విద్యార్థులు ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

మరోవైపు, ప్రొటోకాల్ విషయంపైనా గవర్నర్ తమిళిసై స్పందించారు. తన విషయంలో ప్రొటోకాల్ అంశం బహిరంగ రహస్యమేనని అన్నారు. తెలంగాణలో ప్రొటోకాల్ ఎక్కడుందని ప్రశ్నించారు. అనంతరం అక్కడ్నుంచి తెలతంగాణ యూనివర్సిటీకి బయల్దేరారు గవర్నర్. అంతకుముందు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.

English summary
Telangana governor visits Basara IIIT: meets students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X