అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. భూములు లీజులు, చట్ట సవరణలు

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నవంబర్‌ 29న విద్యా దీవెన కార్యక్రమం అమలు చేస్తారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కోసం 432 కొత్త 104 కొనుగోలు కోసం వైఎస్ఆర్‌ ఆరోగ్య శ్రీహెల్త్‌కేర్‌ట్రస్ట్‌కు పరిపాలనాపరమైన అనుమతులు ఇవ్వడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ మెడిసినల్‌ అండ్‌ ఆరోమేటిక్‌ ప్లాంట్స్‌ బోర్డ్‌లో 8 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

చట్ట సవరణ

చట్ట సవరణ

డిప్యూటేషన్‌ విధానంలో 4 పోస్టులు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో 4 పోస్టుల భర్తీ చేస్తారు. శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కాలేజీలో మెరుగైన సదుపాయాల కల్పనకోసం టీటీడీకి అప్పగిస్తూ చట్ట సవరణ కోసం అసెంబ్లీలో బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ బొవైన్‌ బ్రీడింగ్‌ బ్రీడింగ్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదించింది. నవంబర్‌ 16న ఎస్‌పీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు కేబినెట్‌ అంగీకరించింది. కడప జిల్లా కొప్పర్తిలో డిక్సన్‌ టెక్నాలజీస్‌కు నాలుగు షెడ్ల కేటాయింపుతోపాటు ఇన్సెంటివ్‌లకు.. డిక్సన్‌ ఏర్పాటు చేయనున్న మరో యూనిట్‌కు 10 ఎకరాల భూమిని కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 5 ఎకరాల భూమి

5 ఎకరాల భూమి

మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌1955కు సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.. రాజమహేంద్రవరం నగరం నామవరం గ్రామంలో 5 ఎకరాల భూమి ముంబైకి చెందిన మహీంద్రా వేస్ట్‌ టు ఎనర్జీ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌కు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం, 20 సంవత్సరాలపాటు లీజుకు ప్రభుత్వం ఇవ్వనుంది. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ది, అర్చక సంక్షేమం కోసం కామన్‌ గుడ్‌ ఫండ్‌ ఏర్పాటుకు, ఈఏఎఫ్‌ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి సంబంధించి చట్టంలో సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ ముందుకు చట్టం రానుంది. ధార్మిక పరిషత్తు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటుకు సంబంధించి దేవాదాయ శాఖచట్టంలో సవరణలకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం ఇచ్చింది.

లీజుకు 6.5 ఎకరాలు

లీజుకు 6.5 ఎకరాలు

తాడేపల్లి మండలంలో ధార్మిక సంస్థకు 6.5 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయిస్తూ కేబినెట్‌ ఆమోదం.. ఆంధ్రప్రదేశ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ చట్ట సరవణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.. ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ యూనివర్శిటీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌అండ్‌ రెగ్యులేషన్‌ చట్టంలో సవరణలకు కేబినెట్‌ ఆమోదం.. ఉన్నత విద్యాశాఖలో ఏపీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌లో సరవణకు ఉద్దేశించిన బిలుకు కేబినెట్‌ ఆమోదం.. జవహర్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్శిటీ యాక్ట్‌ కు సంబంధించిన సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదించింది.

 ఆంధ్రకేసరి వర్సిటీ

ఆంధ్రకేసరి వర్సిటీ

విజయనగరం జేఎన్టీయూ కాలేజీ పేరు మార్పునకు ఆమోదం.. విజయనగరం జేఎన్టీయూ జీవీగా మార్పు చేయడానికి అంగీకరించింది. ఉన్నత విద్యా శాఖలో ఏపీ యూనివర్శిటీ చట్టం 1991 లో సవరణలకు ఆమోదం.. ఆచార్య నాగార్జున ఒంగోలు పీజీ క్యాంపస్‌ను పేర్నమిట్టకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఆంధ్రకేసరి యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ -2021 బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.. శ్రీకాకుళం జిల్లా పొందూరు డిగ్రీ కాలేజీలో 27 టీచింగ్‌ పోస్టులు, 15 నాన్‌ టీచింగ్‌ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 15 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఒక పోస్టు పదోన్నతిమీద, మిగిలిన 14 అవుట్‌ సోర్స్‌ పద్ధతిలో నియమిస్తారు.

 అసైన్డ్ ల్యాండ్ చట్టంలో సవరణలు

అసైన్డ్ ల్యాండ్ చట్టంలో సవరణలు

ఏపీ అసైన్డ్‌ ల్యాండ్‌చట్టంలో సవరణలకు కేబినెట్‌ ఆమోదం.. కేటాయించిన ఇంటి స్థలం 20 ఏళ్లకు కాకుండా 10 ఏళ్లకే విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. విశాఖజిల్లా చింతపల్లి మండలం తాజంగిలో 21.67 ఎకరాల పోరంబోకు భూమిని గిరిజన మ్యూజియం, బొటానికల్‌ గార్డెన్, టూరిజం డెవలప్‌మెంట్‌కు కేటాయిస్తూ కేబినెట్‌ ఆమోదం.. వైఎస్ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్‌ యాక్ట్‌ 1971లో సవరణల బిల్లుకు కేబినెట్‌ ఆమోదం. ఆంధ్రప్రదేశ్‌ సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపు విమెన్‌ కో కంట్రిబ్యూటరీ పెన్షన్‌యాక్ట్‌ 2009కు సవరణలు చేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

2వ వైస్ చైర్మన్ పదవీ

2వ వైస్ చైర్మన్ పదవీ

ఏపీ పంచాయతీరాజ్‌ యాక్ట్‌-1994లో సవరణలకు కేబినెట్‌ ఆమోదం. జిల్లా పరిషత్‌ల్లో , మండల పరిషత్‌ల్లో 2వ వైస్‌ఛైర్మన్‌పదవులకోసం ఉద్దేశించిన సవరణలు చేసేందుకు అంగీకారం తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ఛైర్‌పర్సన్లను, ఇతర కులాల కార్పొరేషన్ల ఛైర్మన్లను జిల్లా పరిషత్‌ సమావేశాల్లో శాశ్వత ఆహ్వానితులగా అవకాశమిస్తూ చట్ట సవరణకు ఆమోదం. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌లో 16 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం.
ఏపీ హైకోర్టులో మీడియేషన్‌ సెంటర్‌ అండ్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. ఆంధ్రప్రదేశ్‌ సినిమా రెగ్యులేషన్‌యాక్ట్‌ 1955 చట్టంలో సవరణలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

English summary
andhra pradesh cabinet made key decisions on before assembly session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X