అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అణువణువు దుర్భేద్యం: సీఎం జగన్ నివాస పరిధి హై అలర్ట్.. ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెం నివాసం పరిధిలో పోలీసులు హై అలర్ట్ నిర్వహించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రైతులు, కూలీలు, మహిళలు గత 549 రోజులుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. శనివారంతో ఈ ఉద్యమం 550 రోజులకు చేరుకోనుంది. రైతులు భారీ ర్యాలీలు, నిరసనలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రైతుల ర్యాలీలు, నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాల వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. సీఎం ఇంటి పరిధిలో నివాసం ఉండే వారు కొత్త వారికి ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైఅలర్ట్ మధ్య శనివారం ఏం జరుగుతుందో...? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 ap cm jagan house area high alert

అమరావతి రైతుల దీక్షలకు రేపటితో 550 రోజులు పూర్తికానుంది. నిరసనకారులు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రైతుల నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

సీఎం క్యాంపు కార్యాలయానికి దారితీసే మార్గాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అమరావతి రైతులు ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలోనూ రైతుల దీక్షలు కొనసాగాయి.

English summary
andhra pradesh cm ys jagan mohan reddy house area high alert due to amaravati farmers agitation comes to 550 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X