అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసుల అతి సరికాదు, సీఎం చెప్తే అంతేనా.. చంద్రబాబు ధ్వజం

|
Google Oneindia TeluguNews

వైసీపీ సర్కారుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే అశోక్ బాబు అరెస్ట్ విషయంలో సీఐడీ అధికారులు అతిగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఆయనపై కక్షగట్టి కేసులు పెట్టారని ఆరోపించారు. సీఐడీ కేసులో బెయిల్ పై బయటికి వచ్చిన ఎమ్మెల్సీ అశోక్ బాబును పరామర్శించారు. అశోక్ బాబును అడిగి కేసు వివరాలు తెలుసుకున్నారు.

ఇవాళ మేం..

ఇవాళ మేం..


టీడీపీ శ్రేణులను బాధపడినట్టే, రేపు వైసీపీ వాళ్లు కూడా బాధపడతారని చంద్రబాబు అన్నారు. రేపన్నది ఒకటి ఉంటుందని మరువరాదని హెచ్చరించారు. 4 వేల మందిపై కేసులు పెట్టారని వివరించారు. ముగ్గురు మాజీ మంత్రులను, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను, బీటెక్ రవి వంటి వ్యక్తులను, నియోజకవర్గ ఇన్చార్జీలను 80 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. 33 మందిని పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారని అన్నారు.

దాక్కోలేదు..

దాక్కోలేదు..

అశోక్‌బాబు ఎక్కడా దాక్కోలేదు.. తప్పు చేస్తే ధైర్యంగా ఆఫీస్‌కు వచ్చి అరెస్ట్ చేయవచ్చు కదా అని అడిగారు. కానీ పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణం అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అర్ధరాత్రి కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడో తిప్పారు. ఉన్మాది చెప్తే.. పోలీసుల విచక్షణ ఏమైందని ప్రశ్నించారు. ఎప్పటికైనా మిమ్మల్ని జగన్‌రెడ్డి బలిపశువులను చేస్తారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడడం తప్పా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

అర్థరాత్రి ఎందుకు

అర్థరాత్రి ఎందుకు

అర్ధరాత్రి అశోక్ బాబును అరెస్ట్ చేయడం ఏంటీ అని అడిగారు. ఇదీ ఏం పద్దతి అని ఆయన ప్రశ్నించారు. మూడేళ్లకే జగన్‌కు అంతుంటే పద్నాలుగు ఏళ్లు సీఎం పదవీ చేపట్టిన తనకెంత ఉండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు వీళ్లే సృష్టించి, వీళ్లే పరిష్కరించినట్టు నటించి అందరితో బలవంతంగా జేజేలు కొట్టించినట్టుకున్నారు అని చంద్రబాబు నాయుడు విమర్శించారు. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి కూడా ప్రస్తావించారు. వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గతంలో మొద్దు శ్రీను హత్య జరిగినప్పుడు అనంతపురం జైలర్‌గా ఉన్న వరుణ్ రెడ్డిని ప్రస్తుతం కడప జైలర్‌గా నియమించారని వివరించారు. కడప జైలర్‌గా వరుణ్ రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

English summary
tdp chief chandrababu naidu meet mlc ashok babu. they discuss arrest and other issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X