అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదీ మీ హక్కు.. పోరాడితేనే నిధులు వస్తాయ్.. మళ్లించడానికి జగన్‌ ఎవరు..?: చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

సంధు దొరికితే చాలు సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు ఫైర్ అవుతుంటారు. ప్రభుత్వ విధానపర అంశాలపై కామెంట్స్ చేస్తుంటారు. ఇవాళ టీడీనీ ఆధ్వర్యంలో కొన్ని జిల్లాల సర్పంచులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల‌ను పోరాడి సాధించుకోవాల‌ని వారికి చంద్రబాబు పిలుపునిచ్చారు.కేంద్రం నుంచి విడుద‌ల‌వుతున్న న‌రేగా నిధుల‌ను జ‌గ‌న్ స‌ర్కారు పంచాయ‌తీల‌కు ఇవ్వ‌డం లేదని ఆరోపించారు. వాటిని ఇత‌ర‌ ప‌నుల‌కు మ‌ళ్లిస్తోంద‌ని మండిపడ్డారు. దీనిపై స‌ర్పంచ్‌లు క‌లిసిక‌ట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

సద‌స్సుకు హాజ‌రైన చంద్ర‌బాబు నిధుల‌ను రాబ‌ట్టుకోవాల్సిన అంశాల‌పై స‌ర్పంచ్‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. రాష్ట్రాల‌కు ఇవ్వాల్సిన నిధుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌క్క‌దారి ప‌ట్టిస్తే.. రాష్ట్రాలు ఊరుకుంటాయా? అని ప్ర‌శ్నించారు. గ్రామ పంచాయ‌తీల‌కు ఇచ్చిన నిధుల‌ను రాష్ట్రాలు ప‌క్క‌దారి ప‌ట్టిస్తే స‌ర్పంచ్‌లు పోరాడాల్సిందేన‌ని తెలిపారు. నా ప్ర‌భుత్వం నా ఇష్టం అన్న‌ట్టుగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిపడ్డారు. అలాగే మీరు.. నా పంచాయ‌తీ నా ఇష్టం అన్న రీతిలో స‌ర్పంచ్‌లు కూడా రాష్ట్ర ప్ర‌భుత్వంపై పోరాటం సాగించాల్సిందేన‌ని సూచించారు.

chandrababu naidu suggests to sarpanchs for funds

సీఎంగా జ‌గ‌న్‌కు రాజ్యాంగం ఎలాంటి హ‌క్కులిచ్చిందో.. అలాగే స‌ర్పంచ్‌ల‌కు కూడా రాజ్యాంగ్ హ‌క్కులిచ్చింద‌ని తెలిపారు. వాటిని పోరాడి సాధించుకోవాల్సిన అవ‌స‌రాన్ని స‌ర్పంచ్‌లు గుర్తించాల‌ని చంద్ర‌బాబు తెలిపారు. పోరాడితేనే హక్కులు సిద్దిస్తాయని ఆయన చెప్పారు. నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తే.. ఇతర పనులకు ఎలా మళ్లిస్తారని చంద్రబాబు అడిగారు. దీనిపై గట్టిగా నిలదీయాలని ఆయన సూచించారు.

Recommended Video

Chandrababu Naidu - Nitin Gadkari మధ్యలో AP CM Jagan | TDP VS BJP | Oneindia Telugu

పల్లెలే ప్రగతికి సోపానాలు.. ఈ విషయాన్ని మహాత్మా గాంధీ ప్రకటించారు. దానిని ఇప్పటి ప్రభుత్వాలు పాటించాలి. అందుకోసమే కేంద్రం నిధులు విడుదల చేస్తోంది. పారిశుద్ద్యం, రహదారుల నిర్మాణ పనులపై ఫోకస్ చేయాలి. కానీ నిధులు మళ్లించి మరీ పాలన చేస్తున్నారు. ఒక అంశం కోసం వస్తే.. దానిని చేయకుండా, మరో దానిని చేయడం ఏంటీ అని అడుగుతున్నారు. ఈ మేరకు కొందరు సర్పంచ్‌లకు అవగాహన సదస్సును కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వంపై గొంతెత్తి పోరాడాలని.. అప్పుడే మీ నిధులు మీకు వస్తాయని చెబుతున్నారు.

English summary
tdp chief chandrababu naidu suggests to sarpanchs for funds. cm jagan Diversion narega funds he alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X