అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్‌తో సీఎం జగన్ దంపతుల భేటీ.. కీలక అంశాలపై చర్చ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు భేటీ అయ్యారు, సోమవారం సాయంత్రం రాజ్ భవన్ వచ్చిన ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. గవర్నర్‌ను సీఎం జగన్ వెంకటేశ్వర స్వామి మెమెంటో, శాలువాతో సత్కరించారు.

గవర్నర్‌కు వివరణ

గవర్నర్‌కు వివరణ


దావోస్ పర్యటన నుంచి వచ్చిన సీఎం జగన్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో భేటీ విషయాలను గవర్నర్‌కు వివరించారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గతంలో ఎన్డీఏకు వైసీపీ మద్దతు ఇచ్చింది. దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన రెండు రోజులకే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

నిధుల గురించి చర్చ

నిధుల గురించి చర్చ


రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సమస్యల.పై ప్రధాని మోడీకి వినతి పత్రం అందజేశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర షెకావత్, అమిత్ షాను జగన్ కలిశారు. రాష్ట్రపతి ఎన్నికల విషయమై కూడా ప్రధాని మోడీతోపాటు అమిత్ షాతో జగన్ చర్చించారు. కోనసీమ అల్లర్లు, ఢిల్లీ పర్యటన, విశాఖ జిల్లాలో గ్యాస్ లీక్ వంటి అంశాలు కూడా వీరి మద్య చర్చకు వచ్చినట్టుగా సమాచారం. అమరావతిలో టీటీడీ ఆలయ ప్రాణ ప్రతిష్టకు రావాల్సిందిగా సీఎం జగన్ గవర్నర్ దంపతులను ఆశ్వానించారని తెలిసింది. వెంకటపాలెంలో రూ. 40 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో టీటీడీ దేవాలయాన్ని నిర్మించింది.

ఇవే కీలక అంశాలు

ఇవే కీలక అంశాలు


కోనసీమ అల్లర్లు, ఢిల్లీ పర్యటన, విశాఖ జిల్లాలో గ్యాస్ లీక్ వంటి అంశాలు కూడా వీరి మద్య చర్చకు వచ్చినట్టుగా సమాచారం. అమరావతిలో టీటీడీ ఆలయ ప్రాణ ప్రతిష్టకు రావాల్సిందిగా సీఎం జగన్ గవర్నర్ దంపతులను ఆహ్వానించారని తెలిసింది. వెంకటపాలెంలో రూ. 40 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో టీటీడీ దేవాలయం నిర్మించింది.

కీలక బిల్లులు

కీలక బిల్లులు


త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు, ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌ే కీల‌క బిల్లుల‌పై గ‌వ‌ర్న‌ర్‌తో జ‌గ‌న్ చ‌ర్చించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త , శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్ , విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణు, ఎన్ టిఆర్ విజయవాడ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు, పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా, డిసిపి జాషువా, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్య రెడ్డి, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు..

English summary
andhra pradesh cm jagan couple meets governer bisbhusan harichandan at raj bhavan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X