చనిపోయాడనుకొని అంత్యక్రియలు నిర్వహించారు, కానీ, బతికొచ్చాడు, ఏం జరిగింది?

Posted By:
Subscribe to Oneindia Telugu

నెల్లూరు: చనిపోయాడని ఓ వ్యక్తికి అంత్యక్రియలు కూడ నిర్వహించారు.అతడిని తలుచుకొంటూ బాధపడుతున్నారు.అయితే చనిపోయాడనుకొన్న వ్యక్తి తిరిగి వచ్చాడు. దీంతో ఆ కుటుంబసభ్యులు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకొంది.

నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని పొక్కందల గ్రామానికి చెందిన పుల్లయ్య, పద్మమ్మ దంపతుల చిన్న కుమారుడు ముళి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.మురళికి భార్య మాధవి, ఏడాది వయస్సున్న పాప ఉన్నారు.

A miracle inicident happend in Nellore district

నెల రోజుల క్రితం విధుల కోసం ఇంటి నుండి వెళ్ళిన మురళి ఆ తర్వాత ఆచూకీ లేకుండాపోయాడు. అయితే గత నెల 25న, సైదాపురం అటవీ ప్రాంతంలోని పల్లెమిట్ట గని గుంతలో ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు.

పోస్టుమార్టం తర్వాత మురళి కుటుంబసభ్యులు కూడ వెళ్ళి మృతదేహన్ని చూశారు.శరీరంపై ఉన్న గుర్తులు మృతదేహంపై ఉన్న ఆనవాళ్ళతో సరిపోలడంతో ఆ మృతదేహం మురళిదే అని నిర్ధారించారు.మృతుడి తల కింద పొత్తి కడుపులో ఆపరేషన్లు జరిగాయి. మృతదేహంపై కూడ అదే బాగాల్లో మృతదేహంపై ఆపరేషన్ల గాట్లు ఉండడంతో మురళిదే మృతదేహమని భావించారు.గత నెల 26, అంత్యక్రియలు నిర్వహించారు.

రావూరుకు శనివారం నాడు శీతలపానీయాల లోడు లారీ వచ్చింది. ఆ లారీలో మురళి ఉండడాన్ని చూసిన బంధువులు కుటుంబసభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. అతడి ఫోటోను కూడ పంపారు. ఆ లారీ చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో ఉన్న శీతలపానీయాల గోదాము వద్దకు వెళ్ళింది.

దీంతో కుటుంబసభ్యులు కూడ అక్కడికి వెళ్ళి మురళిని కలుసుకొన్నారు. రాత్రి ఇంటికి తీసుకువచ్చారు.అయితే తాము అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరదనే విషయం కుటుంబసభ్యులకు అంతుపట్టడం లేదు. మరోవైపు చనిపోయాడని భావించిన వ్యక్తి బతికుండడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A miracle inicident happend in Nellore district on Saturday. Murali working as a lorry driver. last month he went to duty, one dead body found police in Saidapuram forest area lastmonth 25. That dead body like as Murali.Murali parents completed cremetion that body. Murali realtives found him in Ravur on Saturday. parents bring him to home.
Please Wait while comments are loading...