మార్చిలో ఎపి బడ్జెట్‌ సమావేశాలు...గ్రీవెన్స్ కు అధిక ప్రాధాన్యం

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

రాజమహేంద్రవరం: మార్చిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ఉంటాయని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ సమావేశాలు దాదాపు 20 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అన్నారు.రాజమహేంద్రవరంలో రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇంట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

బడ్జెట్ సమావేశాల గురించి యనమల వివరిస్తూ 2018-19 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌పై ఫైనాన్స్‌ సెక్రటరీ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరుకు బడ్జెట్ తుది రూపు దిద్దుకుంటుందని చెప్పారు. మార్చి మొదటివారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పారు. తమ ప్రభుత్వం గడచిన మూడేళ్లలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువే పని చేసిందని, అయితే ఇవాళ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పారు.

 కేటాయింపుల కంటే అదనంగా...

కేటాయింపుల కంటే అదనంగా...

బడ్జెట్‌ కేటాయింపులే కాకుండా నీటి పారుదల‌, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలు అదనంగా ఖర్చు చేశాయని, వాటికి రూ.13వేల కోట్లు అదనంగా ఇచ్చామని మంత్రి యనమల వివరించారు. ధీనివల్ల మూలధన వ్యయం బడ్జెట్‌లో 10 నుంచి 15శాతం పెరిగిందన్నారు.

మూలధన వ్యయం...

మూలధన వ్యయం...

మూలధన వ్యయం అభివృద్ధికి సూచన అని, కేవలం అర్థ సంవత్సరంలో రూ.10వేల కోట్లు మూల ధన వ్యయం చేశామని గమనించాలని యనమల తెలిపారు. రెవెన్యూ ఖర్చు ఇంకా పెరుగుతోందని అయితే దానిని కంట్రోల్‌ చేసుకోవచ్చని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rajahmundry: The budget session of andhra pradesh Assembly would begin from March first week . Finance Minister yanamala ramakrishnudu gives clarity about budget session in press meet held at rajahmundry.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి