ఏపీకి ఆక్సిజన్ సరఫరా ఇంకెప్పుడు?: కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు, తెలంగాణకే ఎక్కువా!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన మేర ఆక్సిజన్ సరఫరా చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు, తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది.

కేసులు తక్కువున్నా.. తెలంగాణకు ఎక్కువ, ఏపీ తక్కువ
కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరానికి తగినట్లుగా రెమిడివివిర్ సరఫరా జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయని, డిమాండ్‌కు తగిన విధంగా ఆక్సిజన్ సరఫరా కేంద్రం నుంచి జరగడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తక్కువ కేసులున్న తెలంగాణకు 690 టన్నులు ఇచ్చి.. ఎక్కువ కేసులున్న ఏపీకి 580 టన్నులే ఇచ్చారని తెలిపింది. కాగా, తెలంగాణలో రోజుకు 4వేలలోపే కరోనా కేసులు నమోదవుతుండగా, ఏపీలో 20వేలకుపైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.

ఏపీకి ఆక్సిజన్ సరఫరాపై కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు
ఈ విషయాలపై స్పందించిన హైకోర్టు.. ఇలా ఎలా చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. అన్ని రాష్ట్రాల అవసరాలకు సరిపడా సరఫరా బ్యాలెన్సింగ్ చేస్తామని కేంద్రం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవసరానికి సరిపడా ఆక్సిజన్ ప్లాంట్లు ఎప్పుడు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి మూడు నెలల సమయం పడుతుందని కేంద్రం తరపు న్యాయవాది బదులిచ్చారు.

జూన్ వరకు ఆక్సిజన్ 15 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్న కేంద్రం
అయితే, ఇది చాలా ఎక్కువ సమయమని, వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కంప్రెషర్ల తయారీలో జాప్యం జరుగుతోందని, జూన్ మొదటివారంలో 15 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని కేంద్రం తరపు న్యాయవాది తెలిపారు. ఆస్పత్రుల్లో బిల్లు చెల్లింపులు నోడల్ అధికారి ద్వారా చేయాలని హైకోర్టు ఆదేశించింది.
తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. కాగా, ఇటీవల ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యం కారణంగా తిరుపతి రుయా ఆస్పత్రిలో 11 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పలు జిల్లాల్లోనూ ఆక్సిజన్ అందక ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications