వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసిపిలో కేసుల ఆందోళన, జగన్‌కు మరో 10మంది ఎమ్మెల్యేలు షాక్?

తెలుగుదేశం పార్టీ ఏపీలో మరోసారి ఫిరాయింపులకు తెరలేపనుందా? అంటే కావొచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో పదిమంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి వైపు చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఏపీలో మరోసారి ఫిరాయింపులకు తెరలేపనుందా? అంటే కావొచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో పదిమంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి వైపు చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

దాదాపు ముప్పై నుంచి నలభై మంది ఎమ్మెల్యేలు వైసిపి నుంచి తమ పార్టీలోకి వస్తారని గతంలో టిడిపి నేతలు పలుమార్లు ప్రకటించారు. కానీ అది 21 మంది ఎమ్మెల్యేలతో ఆగిపోయింది. అయితే, అది చంద్రబాబు వ్యూహాంలో భాగంగానే నిలిచిపోయిందని అంటున్నారు.

<strong>నంద్యాలపై బాబు ట్విస్ట్: 'డబుల్' హామీపై శిల్ప డైలమా? అక్కడే అఖిలతో చిక్కు</strong>నంద్యాలపై బాబు ట్విస్ట్: 'డబుల్' హామీపై శిల్ప డైలమా? అక్కడే అఖిలతో చిక్కు

ఒకేసారి కాకుండా విడతల వారీగా అయితేనే పార్టీకి లాభమని టిడిపి నేతలు ఆలోచన చేసి ఉంటారని అంటున్నారు. ఒకేసారి ఎమ్మెల్యేలు పార్టీలో చేరడం కంటే విడతలుగా చేరితేనే లాభం. కాబట్టి టిడిపి పెద్దలు అదే ఆలోచనతో అప్పట్లో ఫిరాయింపులకు ఫుల్‌స్టాప్ పెట్టారని, త్వరలో మళ్లీ తెరలేపబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పదిమంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారా?

పదిమంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారా?

దాదాపు పది మంది ఎమ్మెల్యేలు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని, అధికార పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే, వారు ఎవరు, ఎప్పుడు వస్తారో తెలియాల్సి ఉంది.

నిజంగానే మరికొందరు ఎమ్మెల్యేలు వైసిపిని వీడి టిడిపి వైపు వస్తే జగన్‌కు మరోసారి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఇప్పటికే టిడిపి నేతలు పార్టీ ఫిరాయింపులపై జగన్‌నే తప్పుబడుతున్నారు.

జగన్‌ను తప్పుబడుతూ..

జగన్‌ను తప్పుబడుతూ..

జగన్ వ్యవహార శైలి నచ్చకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి వచ్చారని, మరికొంతమంది వస్తారని చెబుతున్నారు. సాక్షాత్తు రాజ్ భవన్ ఎదుట పూర్తి మెజార్టీ ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ ప్రకటించడం వైసిపి ఎమ్మెల్యేల్లోనే కొందరు జీర్ణించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.

అలాగే, జగన్ ఒంటెత్తు పోకడలు కూడా ఎమ్మెల్యేలు జీర్ణించుకోవడం లేదని విమర్శించారు. మొత్తానికి జగన్ వైఖరి వల్లనే ప్రజాప్రతినిధులు టిడిపిలోకి వచ్చారని చెబుతున్నారు. మొత్తానికి ఎమ్మెల్యేల ఫిరాయింపుకు టిడిపి నేతలు జగన్‌నే తప్పుబడుతున్నారు.

పార్టీ మారే అవకాశాలున్నాయా?

పార్టీ మారే అవకాశాలున్నాయా?

వైసిపి నుంచి 67 మంది ఎమ్మెల్యేలు గెలవగా ఇప్పటికే 21 మంది టిడిపిలో చేరారు. దీంతో వైసిపి బలం 46కు పడిపోయింది. తమ పార్టీలోకి మరికొంతంది వైసిపి ఎమ్మెల్యేలు వస్తారని చాలా రోజులుగా టిడిపి నేతలు చెబుతున్నారు.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి వైపు చూసే అవకాశముందా? అంటే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. అందుకు ప్రధానంగా జగన్‌ను వెంటాడుతున్న కేసులే కారణమని అంటున్నారు. ఇటీవల మళ్లీ కేసులు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

జగన్ కేసు ఆందోళన.. ఏమైనా జరగొచ్చు

జగన్ కేసు ఆందోళన.. ఏమైనా జరగొచ్చు

ఇప్పటికే జగన్ కేసులో 11 ఛార్జీషీట్లలో ఆయన పేరు ఉంది. ఆ కేసు విచారణ ఈ మధ్య నెమ్మదించిందనే వాదనలు ఉన్నాయి. అయితే ఎన్నికల సమయానికి విచారణలో వేగం పుంజుకునే అవకాశాలు కొట్టిపారేయలేమని, అలాగే, జగన్ బెయిల్ రద్దు చేయాలని ఇప్పటికే సిబిఐ పిటిషన్ దాఖలు చేసిందని, కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు.

వీటిని బేరీజు వేసుకొని కొంతమంది ఎమ్మెల్యేలు 2018 చివరి దాకా వేచి చూసే ధోరణిలో ఉంటారని, మరికొంత మంది ఎమ్మెల్యేలు జంప్ చేసినా చేయవచ్చునని అంటున్నారు. ఇతర రాజకీయ విషయాలను పక్కన పెడితే ప్రధానంగా జగన్‌కు కేసులో ఇబ్బందికరమని, ఈ కారణంగానే ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పుడు సైకిల్ ఎక్కితేనే సీటు ఖాయం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయంటున్నారు.

టిడిపికి చెప్పుకునే అవకాశం

టిడిపికి చెప్పుకునే అవకాశం

2019 ఎన్నికల సమయంలో వైసిపిని వీడి టిడిపిలో చేరితే అది జగన్‌కు దెబ్బ. అదే సమయంలో టిడిపికి అనుకూలం. జగన్ తీరు నచ్చకనే ఎమ్మెల్యేలు నాలుగేళ్లుగా టిడిపిలో చేరారని తెలుగుదేశం పార్టీ చెప్పుకునేందుకు అవకాశముంటుంది. విడతలవారీగా చేరితో సమస్యలు పక్కకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

English summary
It is said that Another 10 YSR Congress Party MLAs are talks with Telugudesam Party to join.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X