Akhanda 2: బాలయ్యకు చంద్రబాబు బిగ్ న్యూస్..! అఖండ 2కు బూస్ట్..!
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 15న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అఖండ 2 చిత్రానికి సంబంధించి చిత్ర నిర్మాతలు చేసిన ఓ విజ్ఞప్తికి ఏపీ సర్కార్ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
భారీ బడ్జెట్ తో తీసిన అఖండ 2 చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఈ చిత్ర నిర్మాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో వారి విజ్ఞప్తిని మన్నిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4న రాత్రి 10 గంటలకు ప్రత్యేక బెనిఫిట్ షో వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షోకు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అలాగే సినిమా విడుదలైన రోజు నుండి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

బాలయ్య నటించిన అఖండ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ చిత్రం అఖండ 2పైనా భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ 2లోనే బాలయ్య విశ్వరూపం చూపించాడని అభిమానులు అప్పట్లో సంబరపడ్డారు. దీంతో దర్శకుడు బోయపాటి ఈసారి అఖండ 2లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని అభిమానులకు పండగ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంది. అలాగే బాలయ్య వేషధారణ చూస్తే థియేటర్లలో పూనకాలు రావాల్సిందేనంటున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.
-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications