AP Pensions: ఆ పెన్షన్లపై మంత్రి కీలక ప్రకటన..! పుల్ క్లారిటీ..!
ఏపీలో జనవరి నెల పెన్షన్లను ఒకరోజు ముందుగా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ సచివాలయ ఉద్యోగులు తాజాగా కోరడంతో ఆ మేరకు ప్రభుత్వం అంగీకరించింది. జనవరి 1కు బదులుగా డిసెంబర్ 31నే పెన్షన్లు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో మరో మూడు రోజుల్లో పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులు సిద్దమవుతున్నారు. ఇలాంటి సమయంలో దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి వైసీపీ ఓ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 లక్షల దివ్యాంగుల పెన్షన్లను తొలగించిందంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. తాజాగా చేపట్టిన సర్వేల ద్వారా ఇలా భారీగా పెన్షన్లను తొలగిస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ పెన్షన్ల తొలగింపుపై స్పందించింది. ఈ మేరకు దివ్యాంగుల శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి క్లారిటీ ఇచ్చారు. దివ్యాంగుల పింఛన్లపై బ్లూ మీడియా దిగజారుడు రాతలు సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

కూటమి ప్రభుత్వం 5 లక్షల పింఛన్లు తొలగించిందని జగన్ అండ్ కో విష ప్రచారం చేస్తున్నారని మంత్రి స్వామి ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హులైన ఏ ఒక్కరి పింఛను తొలగించలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. సదరం సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమే జరుగుతోందని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. దివ్యాంగుల పింఛన్ రూ.3 వేల నుంచి రూ.6వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు.

పింఛన్ల కోసం జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళలో రూ.84 వేల కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం18 నెలల్లోనే రూ. 50 వేల కోట్ల ఖర్చు చేసిందని మంత్రి గుర్తుచేశారు. దివ్యాంగులకు సీఎం చంద్రబాబు నాయుడు 7 వరాలు ప్రకటించడంతో వారంతా చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారని తెలిపారు. అది చూసి ఓర్వలేకనే జగన్ అండ్ కో దివ్యాంగుల పింఛన్లపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. పింఛన్ల పెంపుపై మాట తప్పి దివ్యాంగులను సైతం మోసం చేసిన ఘనుడు జగన్ రెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో అర్హులను పక్కనపెట్టి అనర్హులకు ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్లు ఇచ్చి ప్రభుత్వ సొమ్ము దిగ మింగారని మంత్రి విమర్శించారు. తప్పుడు రాతలు, అసత్య ప్రచారాలతో పత్రిక విలువల్ని కాలరాస్తున్న వైసీపీ బ్లూ మీడియాని ప్రజలు చీత్కరిస్తున్నారని తెలిపారు.
-
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications