భారతీ సిమెంట్స్ పై ఊహించని నిర్ణయం, నెక్స్ట్ ఇక..!!
ఏపీలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ చర్చగా మారుతోంది. మాజీ సీఎం జగన్ సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌కు గనుల శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థకు కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలా పురం మండలాల్లో చట్టవిరుద్ధంగా కేటాయించిన సున్నపురాయి భూముల మైనింగ్ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నిర్దేశించింది. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ గనుల శాఖ తాజాగా భారతీ సిమెంట్స్ కు నోటీసులు జారీ చేసింది. వీటిల్లో చట్టవిరుద్ధంగా కేటాయించిన సున్నపురాయి భూముల మైనింగ్ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. భారతి సిమెంట్స్ కంపెనీ ప్రధాన కార్యాలయానికి పోస్టు ద్వారా నోటీసులు పంపించింది. నోటీసులు అందిన 15 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, అదానీ నియంత్రణలో ఉన్న అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ (ఏసీసీ)కు, రామ్‌కో సిమెంట్స్‌కు కూడా నోటీసులు వెళ్లాయి. 2023, 2024లలో అప్పటి జగన్ సర్కారు ఈ మూడు కంపెనీలకు వేర్వేరుగా సున్నపురాయి నిల్వలున్న భూములను కేంద్ర గనులు, ఖనిజాలు(అభివృద్ధి-నియంత్రణ) చట్టం-1957 (ఎంఎండీఆర్ యాక్ట్) నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా.. వేలంలో కాకుండా లీజులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కాగా, భారతి సిమెంట్స్‌కు ఇచ్చిను లీజులు ఎంఎండీఆర్ యాక్ట్‌ను ఉల్లంఘించడంతో పాటుగా 2023 సెప్టెంబరులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చి ఆదేశాలను ఉల్లంఘించి, న్యాయసలహా పేరిట భారీ డ్రామా నడిపి లీజులను నిర్ధారిస్తూ, కాలపరిమితిని 50 ఏళ్లుగా ప్రకటించారు. ఈ మూడు లీజులపై 2024లోనే కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లగా విచారణ జరపాలని ఆదేశించింది. కొత్తగా కేటాయించే లీజులు వేలంద్వారానే జరగాలని 2021లో మరో సవరణ జరిగినా.. వీటిని ఉల్లంఘించి భారతి సిమెంట్స్‌కు లీజుల కేటాయింపు జరిగింది. కాగా, లీజులు ఎందుకు రద్దుచేయకూడదో వివరణ ఇవ్వాలని 2016 డిసెంబరు 30న భారతి సిమెంట్స్‌కు నోటీసులు ఇచ్చింది. ఆ కంపెనీ స్పందించక పోవడంతో 2017 జనవరి 10న లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ)ని రద్దుచేసింది. అయితే, జగన్ సీఎంగా ఉన్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారతి సిమెంట్స్‌కు ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో అత్యంత విలువైన సున్నపురాయి నిల్వలున్న 744 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. మైనింగ్ లీజును ఏకంగా 50 ఏళ్లకు పొడిగించారు. ఇక.. తాజా నోటీసుల పైన భారతీ సిమెంట్స్ స్పందన ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications