భారీగా ఉపాధ్యాయుల బదిలీకి రంగం సిద్దం, వారికే ఛాన్స్ - ముహూర్తం ఫిక్స్..!!
ఏపీలో విద్యా శాఖ సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కళాశాల విద్యా శాఖను ఉన్నత విద్య కమిషనరేట్‌గా మార్చారు. సాంకేతిక విద్యా శాఖను రద్దు చేశారు. దానికి సంబంధించిన సిబ్బంది, ఆస్తులను ఉన్నత విద్యలోకి బదిలీ చేశారు. కొత్తగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, శిక్షణ కమిషనరేట్ ఏర్పాటు చేశారు. అదే విధంగా టీచర్ల బదిలీ ల పైనా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. కొత్త డీఎస్సీ నిర్వహణ పరిగణలోకి తీసుకుంటూ ఈ బదిలీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
ఏపీ ప్రభుత్వం విద్యాశాఖలో సంస్కరణల అమలుకు సిద్దమైంది. ఉన్నత విద్య ప్రక్షాళనలో తొలి అడుగు పడింది. ఇటీవల క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా శాఖల పునర్ వ్యవస్థీ కరణ దిశగా అడుగులు పడ్డాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. కొత్తగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, శిక్షణ కమిషనరేట్ ఏర్పాటు చేశారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి పేరును మార్చారు. ఆయా అంశాలపై ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు ఉపాధి కల్పన, శిక్షణ డైరెక్టరేట్‌ను నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, శిక్షణ కమిషనరేట్‌గా మార్చారు. ఈ కమిషనరేట్ పరిధిలోకి నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, ఓంక్యాప్లు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో మార్పునకు అనుగుణంగా జిల్లాల్లో ఉండే ఉపాధి కల్పన అధికారి పోస్టును జిల్లా ఉపాధి కల్పన, నైపుణ్యాధి కారిగా మార్చారు. కమిషనరేట్ ఏర్పాటుతో ఉన్నత విద్యామండలి అధికారాలు పరిమితం కాను న్నాయి. ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యత మండలిదే. అయితే అడ్మిషన్లన్నీ ఉన్నత విద్య కమిషనరేట్ చేపడుతుంది. ఇప్పటి వరకూ డిగ్రీ అడ్మిషన్లు మండ లి చూస్తోంది. ఇకపై ఆ బాధ్యత కమిషనరేట్దే. కరిక్యులమ్‌లో మార్పులు, వర్సిటీల ర్యాంకులు, ఇతర అకడమిక్ అంశాలకు మండలి పరిమితం కానుంది.

అదే విధంగా, ఉపాధ్యాయ బదిలీలు మే నెలలో చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధం అవుతోంది. ఈ ఏడాది సుమారు 20వేల మంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందని అంచనా. బదిలీల్లో ఇచ్చే సర్వీస్ పాయింట్లకు గతేడాది తరహాలో డెసిమల్స్లోనే పాయింట్లు ఇవ్వనున్నారు. పలు అంశాలపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఉపాధ్యాయ సంఘాలతో మంగళగిరిలోని విద్యాభవన్‌లో సమావేశం నిర్వహించారు. టెన్త్ పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల బాధ్యతల కేటాయింపుపై ప్రధానంగా చర్చ జరిగింది. చాలామంది టీచర్లను దూర ప్రాంతాల్లోని కేంద్రాలకు కేటాయించారని, వాటిని మార్చాలని ప్రతినిధులు కోరారు. బాగా ఎక్కువ దూరం కేటాయించిన వారిని మారుస్తామని అధికారులు చెప్పారు. 50 శాతంపైగా టీచర్లకు బాధ్యతలు ఇచ్చిన 79 పాఠశాలల్లో నిబంధనల మేరకు మార్పులు చేయనున్నారు. జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభమైనప్పుడు అన్ని తరగతుల విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు నిర్వహించాలని అధికారులు సూచించారు.
-
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !!











Click it and Unblock the Notifications