విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ 830 కోట్లు, ఉత్తర్వులు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల కోసం ఏకంగా రూ 830 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు అమల్లో ఉన్న విద్యార్ధుల కిట్స్ పేరు కు సర్వేపల్లి రాధా కృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఇందు కోసం నిధులు మంజూరు చేసింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు ఈ పథకం అమలు కానుంది.
ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరం కోసం సర్వేపల్లి రాధా కృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. దీనికి నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కిట్ల పంపిణీ కోసం మొత్తం రూ. 830.04 కోట్లు నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థి మిత్ర కిట్‌లో విద్యార్థులకు అవసరమైన అనేక వస్తువులు ఉంటాయి. ఇందులో 3 జతల యూనిఫాం క్లాత్‌లు, నోట్ బుక్‌లు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, బెల్ట్, షూలు, స్కూల్ బ్యాగ్, డిక్షనరీ వంటివి ఉన్నాయి.

ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర నిధులతో పాటు కిట్ల సేకరణ, పంపిణీకి అవసరమయ్యే నిధులలో రూ. 157.20 కోట్లను కేంద్ర ప్రభుత్వం కూడా సమకూర్చనుంది. కిట్ల సరఫరాలో నాణ్యత, పారదర్శకతను పాటించేందుకు గాను టెండర్ల ప్రక్రియ ద్వారా సరఫరాదారులు, పంపిణీ దారులను నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కిట్ల సేకరణ సరఫరా కోసం నిధులు మంజూరు చేస్తున్న ట్లు వివరించారు.

టెండర్ల ప్రక్రియ ద్వారా కిట్ల సరఫరా , పంపిణీ దారులను నిర్ణయించాలని ఆదేశాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాఠశాలల పాఠ్యపుస్తకాలు, నైపుణ్య శిక్షణ, నైతిక విలువల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా కిట్ల పంపిణీ కోసం నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవటం ద్వారా వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం లోగానే కిట్లు విద్యార్ధులకు అందనున్నాయి.
-
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు!












Click it and Unblock the Notifications