ఏపీలో వారందరికీ కొత్త పెన్షన్ల మంజూరు - అమలు, పంపిణీ ముహూర్తం..!!
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త పెన్షన్లు మంజూరు పై నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న వారికి కొత్తగా పెన్షన్ల కు ఆమోదం తెలిపింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు జిల్లా గోపాల పురం గ్రామంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్నారు. ఈ నెల పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ 2,738.71 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇదే సమయంలో పెన్షన్ల పంపిణీ గురించి సచివాలయ సిబ్బందికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ 4 వేలు పెన్షన్ అందిస్తోంది. కాగా.. ఎన్టిఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 8,190 మంది లబ్ధిదారులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం రూ.3.28 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకం కోసం నవంబరు నెలలో 63,25,999 మంది లబ్ధిదారులకు రూ.2,738.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ.21,280 కోట్లు పెన్షన్ల కింద లబ్ధిదారులకు అందజేశామన్నారు. డిసెంబరు ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం, గోపాలపురం గ్రామ సచివాలయ పరిధిలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గని లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేస్తారని తెలిపారు.

ఇక.. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్‌దారులకు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేస్తారన్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో క్షేత్ర స్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. అనర్హులను గుర్తించారు. వీరి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధ్రువీక రణ పత్రాలు కోకొల్లలుగా జారీ అయ్యాయి. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరుకు ముందే వాటిని రీ అసెస్మెంట్ ప్రక్రియను చేపట్టింది. కొత్త దరఖాస్తు దారుల నుంచి వచ్చిన అప్లికేషన్లను పరిశీలన చేసిన సిబ్బంది అధికారులకు నివేదిక ఇచ్చారు. కొత్తవి మంజూరు గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది. అర్హులను గుర్తించి నిర్ణయం తీసుకుంటోంది. అందులో భాగంగా తాజాగా 8,190 మందికి డిసెంబర్ 1 నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.
-
End of Naxalism : ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
ఏపీ రాజధానిని మళ్లీ మార్చుకోవచ్చా ? అమరావతి గెజిట్ కూడా సరిపోదా ? -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications