ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్: తప్పులో కాలేసిన జగన్, తప్పు చేస్తున్నారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తప్పులో కాలేశారా? ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఏదైతే తప్పని చెప్పారో, ఇప్పుడు అదే వైసిపి ఆయన దారిలో నడుస్తోందని అంటున్నారు.

జగన్‌కు చెందిన సాక్షి పత్రిక టిడిపిపై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ ఆ పత్రికను నిషేధిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. సీఎం చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో సాక్షిని చదువవద్దని చెప్పారు.

ఇప్పుడు అదే తప్పును వైసిపి అధినేత జగన్ చేస్తున్నారని అంటున్నారు. తాజాగా, వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తాము ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

చంద్రబాబు అదే పత్రిక చదివారు

చంద్రబాబు అదే పత్రిక చదివారు

సాక్షి పత్రికను చదువవద్దని చెప్పిన చంద్రబాబే కొద్ది రోజుల క్రితం విశాఖ పర్యటనలో కారులో సాక్షి పత్రిక చదువుతూ కనిపించారు. చంద్రబాబు అయినా, జగన్ అయినా ఓ పేపర్‌ను బహిష్కరిస్తున్నామని చెప్పి దానిని చదవకుండా లేదా టీవీ ఛానల్‌ను బహిష్కరిస్తున్నామని చెప్పి, దానిని చూడకుండా చేయలేరని అంటున్నారు.

నమ్మకం ఎంత వరకు?

నమ్మకం ఎంత వరకు?

సాధారణంగా పత్రికల్లో వచ్చే వార్తలను ఎవరైనా చదువుతారు. టీవీ ఛానల్స్ చూస్తారు. కానీ ఆయా పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు.. తమకు వ్యతిరేకంగా ఉన్న వార్తలను సహజంగానే నమ్మడం చాలా తక్కువ.

పోరాడారుగా..

పోరాడారుగా..

సాక్షి అక్రమ పెట్టుబడుల కారణంగా పుట్టిందని చంద్రబాబు ఆరోపించారు. దానిని మూసివేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయనే వాదనలు ఉన్నాయి. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సాక్షిపై నిషేధించారు. దీని కోసం ప్రెస్ కౌన్సెల్ దాకా వెళ్లారు. మరి ఇప్పుడు అదే తప్పును వైసిపి చేస్తోందని అంటున్నారు.

కౌంటర్ ఇవ్వాలి కానీ..

కౌంటర్ ఇవ్వాలి కానీ..

ప్రభుత్వ పరంగా నిషేధించడం వేరు, పార్టీ పరంగా నిషేధించడం వేరు అని చెప్పవచ్చు. కానీ నిషేధించాలని చెప్పడమే తప్పని అంటున్నారు. ఎక్కడైనా నిరాధార వార్త వస్తే దానిని ఖండించాలని, లేదంటే కౌంటర్ ఇవ్వాలని, అంతేకానీ నిషేధం అని చెప్పడం ఏమిటని అంటున్నారు.

జగన్ తప్పు చేస్తున్నారా?

జగన్ తప్పు చేస్తున్నారా?

ఇప్పుడు, ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నామని చెప్పడం ద్వారా, గతంలో సాక్షి పత్రికపై తెలుగుదేశం పార్టీ పెట్టిన నిషేధం కరెక్ట్ అని జగన్ భావిస్తున్నట్లేనా అంటున్నారు. ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి రాజకీయ పార్టీకి సొంత మీడియా లేదా అనుకూల మీడియా ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Many are thinking that YSR Congress Party making mistake by banning AndhraJyothy.
Please Wait while comments are loading...