ఆ క్రెడిట్ లోకేష్ దే..! అంతర్జాతీయ మీడియాతో బాబు..!
ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. అక్కడి పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. విరామంలో సీఎం చంద్రబాబు ఇవాళ పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను వారితో సీఎం పంచుకున్నారు. ఇందులోనే తన కుమారుడు, ఐటీ మంత్రికీ ఓ విషయంలో క్రెడిట్ ఇచ్చారు.
టైమ్ మీడియా ప్రతినిధి టిమ్ హోవాట్, బ్లూమ్హబెర్గ్ ప్రతినిధి జీనెత్ రోడ్రిగ్స్, బిజినెస్ టుడే ప్రతినిధి ఆలోక్ నాయర్, ఎన్డీటీవీ నుంచి ఆయుష్ ఐలావాదిలతో చంద్రబాబు ఇవాళ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి విషయంలో జరుగుతున్న పరిణామాలను, ప్రభుత్వ పాలసీలను మీడియా ప్రతినిధులకు వివరించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా పెట్టుబడులు ఆకర్షించటంతో పాటు వివిధ రంగాల్లో నూతన పరిణామాలను గమనించడానికి ఈ సదస్సు అద్భుతమైన వేదిక అన్నారు. గతంలో ఉమ్మడి ఏపీని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ను బ్రాండింగ్ చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరాన్ని వాడుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రానికి బ్రాండింగ్ వస్తే పెట్టుబడులు వస్తాయని, పెట్టుబడులు వస్తే అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధి జరిగితే పేదలకు సంక్షేమం అందించవచ్చని చంద్రబాబు తెలిపారు. సింగపూర్ మాజీ అధ్యక్షుడు లీక్వాన్యూ, మలేషియా మాజీ అధ్యక్షుడు మహతీర్ తనకు స్పూర్తి అన్నారు. తాను ఆశావాదిని అని, భారీ లక్ష్యాలు నిర్దేశించుకోవడం వాటి కోసం నిరంతరం పనిచేయడం తనకు అలవాటు అన్నారు. ముందుచూపుతో వ్యవహరించి, వినూత్నంగా ఆలోచించి, చిత్తశుద్దితో, కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యం అని నమ్ముతానన్నారు. యువతకూఇదే విషయాన్ని చెప్పి ప్రోత్సహిస్తానన్నారు.

విశాఖకు గూగుల్ కంపెనీ రాక ఏపీ అభివృద్ధిలో గొప్ప ముందడుగు అని చంద్రబాబు తెలిపారు.ఐటీ మంత్రి లోకేష్ ఈ విషయంలో చూపిన చొరవ, ఫాలో అప్ వల్లే ఆ పెట్టుబడి సాధించామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ పెట్టుబడిపై లోకేష్ సంప్రదింపులు జరిపారని వారికి గుర్తుచేశారు. అలాగే అమరావతి భవిష్యత్ నగరంగా ఉంటుందని, టెక్నాలజీ, గ్రీన్-బ్లూ సిటీగా దీన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. టూరిజం అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, తమ రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వారికి తెలిపారు. ఏపీలో గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది తన ఆలోచన అన్నారు.
-
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
Gmail ఐడీ నచ్చలేదా? ఈ సింపుల్ ట్రిక్ తో వెంటనే యూజర్ నేమ్ ఛేంజ్ -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications