అమరావతికి బ్యాంకుల క్యూ..!హాజరైన నిర్మల-అన్ స్టాపబుల్ అన్న సీఎం..!
ఏపీ రాజధాని అమరావతిలో త్వరలో నిర్మించనున్న 15 బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవాళ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి శంఖుస్థాపన చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, అమరావతి రైతులు కూడా పాల్గొన్నారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాలతో ఆర్ధిక కేంద్రంగా అమరావతి మారుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు ..పూర్వోదయ స్కీంతో ఆదుకోవాలని, పోలవరం-నల్లమల సాగర్ కు సాయం చేయాలని కోరారు.
రైతుల త్యాగం, కేంద్ర ప్రభుత్వ సహకారం, పక్కా ప్రణాళికతో అమరావతి ఆన్ స్టాపబుల్ గా అభివృద్ధి సాధిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గత పాలకుల విధ్వంసం తర్వాత వెంటిలేటర్ మీదున్న రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడానికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందించిందని సీఎం అన్నారు. రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్లానెటోరియం నిర్మాణానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, చంద్రబాబు సమక్షంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ సంస్థ-సీఆర్డీఏలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి.

ప్రధాని మంత్రి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనుల్ని ప్రారంభించామని, ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనులు స్పీడ్ అందుకున్నాయని చంద్రబాబు తెలిపారు. పనులు ఈ స్థాయిలో జరుగుతున్నాయంటే దానికి కారణం కేంద్ర నిర్మలా సీతారామన్ అన్నారు. రూ.15 వేల కోట్లను రాజధాని పునర్నిర్మాణానికి ఆమె కేటాయించారన్నారు. నిధులకు ఇబ్బంది లేకుండా సహకరించిన కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

15 ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా సంస్థలు అమరావతిలో ప్రధాన కార్యాలయాల భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంసంతోషంగా ఉందన్నారు. రూ.1,334 కోట్లతో బ్యాంకులు, బీమా కంపెనీల ఏర్పాటుతో 6,556 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. మరోవైపు అమరావతి రైతులు గత ప్రభుత్వ విధానాల కారణంగా తమకు రావాల్సిన క్యాపిటల్ గెయిన్స్ అందుకోలేక పోయారని చంద్రబాబు తెలిపారు. క్యాపిటల్ గెయిన్స్ గడువును మరికొంత కాలం పొడిగించాలని ఆర్ధికమంత్రి నిర్మలను కోరారు. క్యాపిటల్ గెయిన్స్ ప్రయోజనాలను రైతులు పొందేలా చూడాలన్నారు. ఇవన్నీ జరిగితే అమరావతి అన్ స్టాపబుల్ అవుతుందన్నారు.
-
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు!












Click it and Unblock the Notifications