చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ నో, బీజేపీలోకి సీకే బాబు: అలాంటి టైంలో పురంధేశ్వరి చక్రం తిప్పారా?

చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు సీకే బాబు గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కమలం తీర్థం పుచ్చుకున్నారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు సీకే బాబు గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కమలం తీర్థం పుచ్చుకున్నారు.

సికె బాబుకు వైసిపి షాక్ వెనుక: లావణ్య దూకుడు మిస్‌ఫైర్, పెద్దిరెడ్డి చక్రం సికె బాబుకు వైసిపి షాక్ వెనుక: లావణ్య దూకుడు మిస్‌ఫైర్, పెద్దిరెడ్డి చక్రం

దీంతో చిత్తూరు నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త మలుపులు చోటు చేసుకున్నాయి. ఎక్కువ కాలం చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న సీకే బీజేపీలో చేరడంతో స్థానికంగా రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి.

సీకే బాబు ఇంటికి బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, ఎందుకంటేసీకే బాబు ఇంటికి బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, ఎందుకంటే

సీకే బాబు పోటీ ఖాయమని తేలింది కానీ

సీకే బాబు పోటీ ఖాయమని తేలింది కానీ

ఇటీవల సీకే బాబుకు తమ పార్టీలో సభ్యత్వం లేదని వైసిపి ఎందుకు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేదా అనే చర్చ సాగింది. ఇప్పుడు అనూహ్యంగా ఆయన బీజేపీలో చేరారు. దీంతో ఆయన పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. అయితే టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీలో చేరారు. దీంతో ఆ రెండు పార్టీలు మళ్లీ జతకడితే ఏమైనా సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది.

నాడు వైసిపి అభ్యర్థికి మద్దతు

నాడు వైసిపి అభ్యర్థికి మద్దతు

స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన సీకే బాబు ఎక్కువ కాలం కాంగ్రెస్‌లో ఉన్నారు. కౌన్సెలర్‌గా, మున్సిపల్ వైస్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పని చేశారు. విభజన అనంతరం వైసిపిలో చేరారు. 2014లో వైసిపి అభ్యర్థి జంగాలపల్లె శ్రీనివాసులుకు మద్దతు పలికారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

వైసిపిలో టిక్కెట్ పైన ఆశలు గల్లంతు

వైసిపిలో టిక్కెట్ పైన ఆశలు గల్లంతు

వచ్చే ఎన్నికల్లో వైసిపిలో టిక్కెట్ వస్తుందని సీకే బాబు భావించారని అంటారు. క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన భార్య ఇటీవల భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో తామే వారసులమని ప్రకటించారు. ఆ తర్వాత వైసిపి.. వారితో తమకు సంబంధం లేదని ప్రకటన చేసింది. ఈ షాక్ నుంచి తేరుకున్న సీకే బాబు దంపతులు ఇప్పుడు బీజేపీలో చేరారు. తన కేడర్‌ను కాపాడుకునేందుకు ఓ పార్టీ చూసుకోక తప్పలేదని తెలుస్తోందని అంటున్నారు.

ఆ ఆశలు ఉన్నాయా

ఆ ఆశలు ఉన్నాయా

ప్రస్తుతం బీజేపీ, టీడీపీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఈ పొత్తు కొనసాగితే 2019లోనూ ఈ రెండు పార్టీలు సీట్లు పంచుకోవాల్సి వస్తుంది. 2014లోనూ చిత్తూరు జిల్లాలో మదనపల్లె అసెంబ్లీ, రాజంపేట ఎంపీ స్థానాల్ని బీజేపీకి కేటాయించారు. ఆయా స్థానాల్లో చల్లపల్లె నరసింహారెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరిలు పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లోనూ చిత్తూరు జిల్లాలో ఓ స్థానాన్ని బీజేపీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో సీకేబాబు చిత్తూరు ఎమ్మెల్యే టికెట్టు ఆశించి బీజేపీలో భాజపాలో చేరినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల నాటికి సమీకరణాలు ఎలా ఉంటాయో చూడాలి.

పురంధేశ్వరి చక్రం తిప్పారా

పురంధేశ్వరి చక్రం తిప్పారా

సీకే బాబుకు స్థానికంగా పట్టు ఉంది. ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుదామనుకున్న సమయానికి టీడీపీలోకి వెళ్లలేని పరిస్థితి. వైసిపి వద్దని చెప్పింది. కాంగ్రెస్‌కు బలం లేదు. ఈ పరిస్థితుల్లో పురంధేశ్వరి ఆయనను కలిసి నచ్చ చెప్పి ఉంటారని భావిస్తున్నారు. వారి కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ఆమె సీకే బాబు ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత రెండు రోజులకే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

English summary
Former Chittoor MLA C.K. Jayachandra Reddy, popularly known as C.K. Babu, and his wife Lavanya on Thursday joined the BJP in the presence of national president Amit Shah in Bengaluru. Party leader D. Purandeswari was present.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X