ఫ్రీ హెల్డ్ అసైన్డ్ భూముల పై ప్రభుత్వం తాజా నిర్ణయం, ఇక నుంచి..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు రెవిన్యూ శాఖకు కీలక ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాల పునః పరిశీలించాలని సీఎం స్పష్టం చేసారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) సహా 22ఏ, ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన అసైన్డ్ భూములు, రీ సర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
సీఎం చంద్రబాబు భూ సమస్యల పరిష్కారం పైన రెవిన్యూ అధికారులకు కీలక నిర్దేశం చేసారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ వరకు వచ్చిన గ్రీవెన్సులు 5,28,217 వచ్చాయని, వీటిలో 4,55,189 గ్రీవెన్సులు పరిష్కరించగా, పరిశీలనలో మరో 73,000 వేల వరకూ ఉన్నాయని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. పాలనా సంస్కరణలతో వేగవంతమైన ఆటోమ్యూటేషన్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 22ఏ జాబితా నుంచి తప్పించాలని కోరుతూ 6,846 దరఖాస్తులు దాఖలయ్యాయని చంద్రబాబు వివరించారు. ఎక్స్ సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ల భూములు 22ఏ నుంచి తొలిగించారని సీఎం తెలిపారు.

6,693 గ్రామాల్లో పూర్తయిన రీసర్వే, వెబ్ ల్యాండ్ 2.0లో వివరాల నమోదు చేశారు. రీసర్వేలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా భూమి రికార్డుల అప్‌గ్రెడేషన్ చేస్తున్నామని వివ రించారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాల పునః పరిశీలించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా మొత్తం 2.77 కోట్ల కుల ధృవీకరణ పత్రాలు ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నామని అన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం స్టాంప్, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 10,169 కోట్ల ఆదాయం ఆర్జించడమే లక్ష్యమని అధికారులకు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 430 రియల్ ఎస్టేట్ వెంచర్లను గుర్తించి, ఆయా ప్లాట్లకు సంబంధించి యూజర్ ఫ్రెండ్లీ రిజిస్టేషన్‌కు కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. దీంతో 15,570 రిజిస్ట్రేషన్లతో రూ.250 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని అధికారుల కు సీఎం చంద్రబాబు వివరించారు.
-
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications