ఆరో స్థానంలో చంద్రబాబు - పవన్, లోకేష్ ర్యాంకులు ఎంత..!?
ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పని తీరును సీఎం చంద్రబాబు వెల్లడించారు. పైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలని నిర్దేశించారు. శాఖల వారీగా మంత్రుల వద్దకు వస్తున్న ఫైల్స్.. వాటి క్లియరెన్స్ కు తీసుకుంటున్న సమయం.. ఏ మంత్రి వద్ద ఎన్ని ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయనే అంశం పైన వివరాలను చెబుతూ... కీలక సూచనలు చేసారు. కాగా, ఫైళ్ల క్లియరెన్స్ లో సీఎం చంద్రబాబు ఆరో స్థానంలో ఉన్నారు. మిగిలిన మంత్రుల ర్యాంకులను బయట పెట్టారు.
తాజాగా జరిగిన మంత్రులు.. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శుల సమావేశంలో ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పని తీరు ను సీఎం వివరించారు. ఫైల్స్ క్లియరెన్స్ టైం రిపోర్ట్‌ను ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సదస్సులో ప్రదర్శించారు. కాగా, ఈ-ఆఫీస్ ఫైళ్ల పరిష్కారంలో సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ముందు వరసలో ఉన్నారు. ఆయన లాగిన్‌కు ఫైల్ రాగానే సగటున రెండు రోజుల 41 నిమిషాల వ్యవధిలోనే పరిష్కరిస్తున్నారు.

ఆ తర్వాతి స్థానంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఈ ఇద్దరూ ఒక్క ఫైలు కూడా పార్కింగ్(ఎటూ తేల్చకుండా పెండింగ్‌లో పెట్టడం) లో ఉంచలేదు. మూడో స్థానంలో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఉన్నారు. ఫైళ్ల పరిష్కారం, లాగిన్‌కు వచ్చిన ఫైళ్లు చూసుకునే సమయం ఆధారంగా ఇచ్చిన డేటాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరో స్థానంలో నిలిచారు.
అయితే, మంత్రుల అందరికంటే సీఎంకు ఎక్కువ ఫైల్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఆయనకు 6,713 ఫైళ్లు రాగా 6,653 పరిష్కరించారు. అత్యధికంగా 401 ఫైళ్లను పార్కింగ్ లో ఉంచారు. ఆయన ఫైల్స్‌ను చూసేందుకు సగటున 3 రోజుల 8.18 గంటల సమయం తీసుకుంటున్నారు. ఐటీ, విద్యా శాఖల లోకేశ్‌ది 9వ వస్థానం. ఆయన లాగిన్‌కు మొత్తం 3,916 పైల్స్ రాగా, 3,669 పరిష్కరించారు. 266 పార్కింగ్‌లో ఉంచారు. ఒక ఫైల్‌ను చూసేందుకు సగటున 3 రోజుల 14:10 గంటలు తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కలా ణ్ 11వ స్థానంలో ఉన్నారు.
ఆయన 2,001 ఫైళ్లు పరిష్కరించారు. 67 పార్కింగ్‌లో ఉంచారు. తన లాగిన్కొచ్చిన ఫైళ్లను చూసేందుకు ఆయన సగటున 4 రోజుల 9.43 గంటల సమయం తీసుకుంటున్నారు. అయితే,ఈ-ఆఫీసు ఫైళ్లను చూడడంలో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, కొల్లు రవీంద్ర వెనుక బడ్డారు. ఫైలు చూసేందుకు రాంప్రసాద్‌రెడ్డి సగటున 15 రోజుల 19.53 గంటలు తీసుకుం టున్నారు. కొల్లు రవీంద్ర 15 రోజుల 5:23 గంటలు తీసుకుంటున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్‌కు 11 రోజులు పడుతోంది. ఈయన చివరి నుంచి మూడోస్థానంలో నిలిచారు.
-
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..











Click it and Unblock the Notifications