దేవాన్ష్‌కు సైకిల్‌ బహుమతిగా ఇచ్చిన టిడిపి నేత అప్పలనాయుడు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనవడు దేవాన్ష్‌కు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టిడిపి నేత, ఏపీ పంచాయితీ రాజ్ ఛాంబర్ సెక్రటరీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సోమవారం నాడు వచ్చిన చంద్రబాబునాయుడుకు అప్పలనాయుడు ఈ సైకిల్‌ను బహుమతిగా ఇచ్చారు.

శ్రీకాకుళంలో హెలిప్యాడ్‌ దిగిన తర్వాత చంద్రబాబుకు ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మంత్రి కళా వెంకట్రావులతో కలిసి అప్పలనాయుడు ఆ సైకిల్‌ను అందించారు. పసుపు శుభసూచికం.. ఇది దేవాన్ష్‌కు బాగుంటుందని శ్రీకాకుళం ఎంపి అని రామ్మోహన్‌ నాయుడు సీఎంతో నవ్వుతూ అన్నారు. శ్రీకాకుళం సైకిల్‌కు పవర్‌ ఎక్కువ అని చంద్రబాబు నవ్వుతూ ప్రతిస్పందించారు.

Cycle presented to CM’s grandson

సైకిల్‌ ఆర్యోగానికి మంచిదని, పసుపు శుభసూచికమని అన్నారు. అనంతరం ఇంటింటికీ కార్యక్రమం ముగిశాక తిరిగి హెలిప్యాడ్‌ దగ్గరకు వెళ్లాక సీఎం చంద్రబాబు.... ఆ సైకిల్‌ను విజయవాడ తీసుకురండి అని గుర్తుపెట్టుకుని మరీ అధికారులను ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లా టిడిపి నేతలు తన మనవడికి ఇచ్చిన బహుమతిని మరీ గుర్తు పెట్టుకొని విజయవాడకు తీసుకురావాలని చంద్రబాబునాయుడు అధికారులకు ఆదేశించడం ఆసక్తి కల్గిస్తోందంటున్నారు టిడిపి నేతలు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP training programmes north Andhra director and AP Panchayat Raj chamber, secretary, Kallisetti Appalanaidu presented a cycle with yellow colour frame to CM, N. Chandrababu Naidu for his grandson Devansh at Tettangi village

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి