కిడ్నాప్ కలకలం: కారులో వచ్చారు.. తండ్రి పక్కనుండగానే కూతుర్ని ఎత్తుకెళ్లారు!

అనంతపురంలో ఓ డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్ అయిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానిక ఆర్టీసీ బస్‌స్టాండ్ లో ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. తండ్రి పక్కనుండగానే కూతుర్ని ఎత్తుకుపోవడం సంచలనం రేపింది

అమరావతి: అనంతపురంలో ఓ డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్ అయిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానిక ఆర్టీసీ బస్‌స్టాండ్ లో ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. తండ్రి పక్కనుండగానే కూతుర్ని ఎత్తుకుపోవడం సంచలనం రేపింది.

వివరాల్లోకి వెళితే... కదిరి మండలం వీరేపల్లికి చెందిన అనూష మాస్టర్ మైండ్స్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. గురువారం కాలేజీ నుంచి ఇంటికెళ్లేందుకు తన తండ్రి కేశవరెడ్డితో కలిసి స్థానిక ఆర్టీసీ బస్‌స్టాండ్ లో నిలుచుని ఉండగా హఠాత్తుగా ఒక కారు వచ్చి ఆగింది.

anusha-kidnap

ఆ కారులో వచ్చిన దుండగులు అనూషను బలవంతంగా కారులోకి లాక్కుని అక్కడ్నించి స్పీడుగా వెళ్లిపోయారు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకుని అనూష తండ్రి కేశవరెడ్డి గట్టిగా కేకలు వేస్తూ కారును వెంబడించినా ఫలితం లేకపోయింది.

జస్ట్.. గంటల్లోనే పట్టేశారు...

ఈ కిడ్నాప్ ఘటనపై అనూష తండ్రి కేశవరెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. ఆధారాల కోసం దగ్గర్లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు.

ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని కొద్ది గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌కు గురైన అనూష క్షమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వారి నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే కిడ్నాప్ ఎందుకు చేశారన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+