ఏపీలో సచివాలయ ఉద్యోగులకు చుక్కలు-ఖరారుకాని ప్రొబేషన్-ఆర్ధిక భారమే కారణం ?
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడుతున్నాయో తెలియదు కానీ అందులో పనిచేసే ఉద్యోగులకు మాత్రం ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ఉద్యోగుల ప్రొబేషన్ పూర్తి చేసి పరీక్షలు నిర్వహించే విషయంలో వివాదం నెలకొంది. దీన్ని పరిష్కరించి కేవలం శాఖాపరమైన పరీక్షలతోనే వారిని పాస్ గా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రొబేషన్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తోంది. దీంతో దాదాపు 80 వేల మంది ఉద్యోగులు సతమతం అవుతున్నారు.

జగన్ మానసపుత్రికలు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడిన అంశాల్లో సచివాలయాలు కూడా ఒకటి, దేశంగా ఎక్కడా లేని విధంగా జగన్ మానసపుత్రికగా తెరపైకి వచ్చిన గ్రామ సచివాలయాల్ని, అందులో పనిచేసే ఉద్యోగుల్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోంది. దీంతో పాలనా పరంగా, రాజకీయంగా కూడా సచివాలయాలపై అందరి దృష్టీ నెలకొని ఉంది. దీంతో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో పాటు కొత్త పథకాలు తీసుకొచ్చినా సచివాలయాలపై, అందులో పనిచేసే ఉద్యోగులపై ఆధారపడక తప్పని పరిస్ధితి. దీంతో సచివాలయ వ్యవస్ధ అంటే వైసీపీ అన్న పేరు వచ్చేసింది.

సచివాలయ ఉద్యోగులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సర్కార్ కు ఎంతో కీలకంగా మారిపోయారు. నిత్యం వీరి పనితీరు ఆధారంగానే ప్రభుత్వ ప్రతిష్ట పెరగడం లేదా తగ్గడం ఆధారపడి ఉంటోంది. సచివాలయ ఉద్యోగులు చేసే తప్పిదాల్ని సైతం మీడియా ప్రముఖంగా ఫోకస్ చేస్తోంది. దీంతో సచివాలయ ఉద్యోగుల వ్యవహారం ఎప్పటికప్పుడు తెరపైకి వస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం ఈ ఉద్యోగుల వ్యవహారాల్లో తీసుకునే నిర్ణయాలు కూడా నిత్యం ఫోకస్ అవుతూనే ఉన్నాయి. అలాగే ఈ ఉద్యోగులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ హామీల్ని నెరవేర్చడంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలూ కీలకంగా మారిపోతున్నాయి.

ఉద్యోగుల ప్రొబేషన్ వివాదం
వాస్తవానికి వైసీపీ సర్కార్ సచివాలయాల్లో దాదాపు లక్షా 30 వేల ఉద్యోగుల్ని ఏపీపీఎస్సీ పరీక్షల ద్వారా నియమించింది. వీరికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పిరియడ్ గా నిర్ణయించింది. ఈ రెండేళ్లలో ఒక్కో ఉద్యోగికి రూ.15 వేల చొప్పున తాత్కాలిక భత్యాన్ని (స్టయిఫండ్) చెల్లించింది. రెండేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత వీరికి పరీక్షలు నిర్వహించి శాశ్వత నియామకాలు ఇస్తామని ప్రకటించింది. అనుకున్నట్లుగానే అందరికీ పరీక్షలు పెట్టి శాశ్వతంగా నియమిస్తుందని అంతా ఆశించారు. కానీ ఈ పరీక్షల్లో పాసయితేనే శాశ్వత నియామకాలు ఇస్తామని తేల్చిచెప్పేసింది. ఇలా కొందరు శాశ్వత నియామకాలకు దూరమైపోయారు. మిగిలిన వారికి అయినా శాశ్వత నియామకాలు ఇచ్చిందా అంటే అదీ లేదు.

శాశ్వత నియామకాల ఆలస్యం
ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీకే సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కాలం పూర్తయింది. ఆ లోపే శాఖాపరమైన పరీక్షలు నిర్వహించి వారికి శాశ్వత నియామకాలు ఇవ్వాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం నవంబర్ నెల గడుస్తున్నా ఇంకా వారికి శాశ్వత నియామకాలు లభించలేదు. ప్రభుత్వం నిర్వహించిన శాఖాపరమైన పరీక్షలు పాసయినా వీరికి శాశ్వత నియామకాలు మాత్రం ఆలస్యమవుతున్నాయి. వీరి పోస్టింగ్స్, ఇతరత్రా వ్యవహారాలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. దీంతో వారు ఈ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో వారు ఆలస్యం చేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 వేల మంది సచివాలయఉద్యోగులు పోస్టింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

వివరాలు కోరిన కలెక్టర్లు
సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేస్తూ శాశ్వత పోస్టింగ్స్ ఇచ్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఈ ఏడాది సెప్టెంబర్ లోనే ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికీ ఆ ప్రక్రియ మొదలుకాలేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో కలెక్టర్లు వీరికి సంబంధించిన వివరాలు పంపాలని ఎంపీడీవోలకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇందులో సదరు ఉద్యోగి శాఖాపరమైన పరీక్ష పాసయ్యారా, గతేడాది ఎన్ని సెలవులు తీసుకున్నారు, వీరిపై ఏమైనా అభియోగాలు, కేసులు ఉన్నాయా వంటి వివరాలను ఎంపీడీవోలు కలెక్టర్లకు అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు వాటిని పరిశీలించి ఫైనల్ చేయాల్సి ఉంటుంది.
Recommended Video

జీతాలు ఆర్ధిక భారమనే ఆలస్యం ?
సచివాలయ ఉద్యోగులకు ప్రస్తుతం రూ.15 వేల రూపాయల స్టయిఫండ్ మాత్రమే ఇస్తున్నారు. అదే శాశ్వత పోస్టింగ్స్ ఇస్తే మాత్రం రూ.35 నుంచి రూ.45 వేల రూపాయల పే స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం ఇస్తున్న స్టయిఫండ్ కు రెండు నుంచి మూడు రెట్ల మేర వేతనం పెరుగుతుంది. ప్రస్తుత ఆర్ధిక పరిస్ధితుల్లో ఈ ఆర్ధిక భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో ఈ ప్రక్రియ నానాటికీ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే అప్పుల్లో ఉన్న ప్రభుత్వం ఇందుకోసం మరో కొత్త అప్పు తీసుకొచ్చే పరిస్ధితి లేదు. కాబట్టి డిసెంబర్ నుంచి కానీ జనవరి నుంచి కానీ వీరికి శాశ్వత పోస్టింగ్స్ ఇచ్చి రెగ్యులర్ జీతాలు ఇవ్వాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. అప్పటివరకూ వీరికి ఎదురుచూపులుప తప్పేలా లేవు.
-
పీఎస్సార్, కాంతిరాణా టాటాపై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం- ఉత్తర్వులు..!! -
రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..!












Click it and Unblock the Notifications