ఆమెతో ఆక్రమ సంబంధం: ఆమె భర్త హత్యకు ఇలా దారి తీసింది

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: ఓ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. గత నల 25వ తేదీన గుర్తు తెలిని శవంగా పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహేతర సంబంధం కారణంగానే ఆ హత్య జరిగినట్లు పోలీసు విచారణలో తేలింది.

అనంతపురం జిల్లా ఇటుకలపల్లి సిఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్ఐ అబ్దుల్ కరీం శుక్రవారం నిందితులు భాస్కర్, రసూల్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

వారిద్దరికి ఇలా పరిచయం

వారిద్దరికి ఇలా పరిచయం

అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రం పెద్దవడుగూరుకు చెందిన చాకలి రాము గొర్రెల వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతూ వచ్చేవాడు. గొర్రెలు విక్రయించే సమయంలో బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన 407 వ్యాన్ డ్రైవర్ భాస్కర్ రాముకు పరిచయమయ్యాడు.

అతని భార్యతో వివాహేతర సంబంధం

అతని భార్యతో వివాహేతర సంబంధం

పరిచయం కారణంగా భాస్కర్ రాము ఇంటికి వస్తూ అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఇది తెలిసి రాము పలుసార్లు హెచ్చరించాడు కూడా. రాము నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందనే భయంతో భాస్కర్ పథకం రచించాడు.

అతనితో కలిసి మద్యం సేవించి...

అతనితో కలిసి మద్యం సేవించి...

తాను ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం భాస్కర్ పెద్దవడుగూరుకు చెందిన రసూల్‌తో రామును అనంతపురంలో కలిసి మద్యం సేవించి శింగనమల మండలం సోదనపల్లికి సమీపంలోని కొండ ప్రాంతాలకు వెళ్లి వెంట అతన్ని తీసుకుని వచ్చి ఇనుపరాడ్లతో కొట్టి గుంతలో పడేశారు

విషయం ఇలా బయటపడింది...

విషయం ఇలా బయటపడింది...

ఫిబ్రవరి 25వ తేదీన పోలీసులు శవాన్ని చూశారు. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శింగనమల మరువకొమ్మ క్రాస్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో విషయం బయటపడింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An extra marital relation lead to the murder of a man in Ananthapur district of Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి