సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ రిలీఫ్ దక్కింది. గత వైసీపీ ప్రభుత్వం సమయంలో ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అంతే కాకుండా ఈ కేసులో చంద్రబాబుతో పాటు మిగిలిన వారికి క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
కాగా 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్‌నెట్ కార్పొరేషన్లో నిబంధనలను ఉల్లంఘించి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు టెండర్లు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.114 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అప్పటి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఎండీ మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ కేసు నమోదు చేసి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడిని ఏ-25గా చేర్చింది. అలాగే అప్పటి ఫైబర్‌నెట్ చైర్మన్ వేమూరి హరికృష్ణ, ఎండీ కె. సాంబశివరావు, టెర్రాసాఫ్ట్ డైరెక్టర్ తుమ్మల గోపాలకృష్ణతో పాటు ముంబై, ఢిల్లీకి చెందిన పలు సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి ఉన్నతాధికారులను నిందితులుగా పేర్కొన్నారు.

అలానే ఈ కేసులో మొత్తం 99 మందిని సాక్షులుగా గుర్తించారు. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం సీఐడీ అధికారులు ఇటీవలే దర్యాప్తు పూర్తయిందని విజయవాడ ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే దర్యాప్తు అనంతరం కీలక మలుపు తిరిగింది. ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌కు ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేస్తూ, కేసును ఉపసంహరించుకోవాలని అప్పటి ఎండీ మధుసూదన్‌రెడ్డి గత నెల 24న కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
ఈ అఫిడవిట్‌కు ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ కూడా సమ్మతి తెలుపుతూ మరో అఫిడవిట్ సమర్పించారు. కోర్టు తీర్పు వెలువడే సమయంలో ఫైబర్‌నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైసీపీ నేత గౌతంరెడ్డి ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చారు. కోర్టు తుది ఉత్తర్వులు ఇవ్వకముందే తన వాదనలు వినాలంటూ ఆయన ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొంటూ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మొత్తానికి దాదాపు ఐదేళ్లుగా రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఈ కేసులో ఆరోపణలకు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేయడం పట్ల తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై అవినీతి ముద్ర వేయాలనే ఈ కుట్రకు తెరలేపారని విమర్శలు గుప్పిస్తున్నారు.
-
ఉద్యోగులు, పెన్షనర్లకు చంద్రబాబు గుడ్ న్యూస్-బకాయిలపై అప్డేట్..! -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!











Click it and Unblock the Notifications