బీకాంలో సీఈసీ: అప్పుడు జలీల్.. ఇప్పుడు ఎస్వీ మోహన్, ‘టీడీపీలో మేధావులు’

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఇప్పటికే బీకాంలో ఫిజిక్స్ చదివినట్లుగా చెప్పి తెలుగుదేశం నేత, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పరువు తీసుకోగా.. మరో ఎమ్మెల్యే కూడా ఆయన బాటలో నడిచారు. తాను డిగ్రీలు సీఈసీ చదివానంటూ తెలుగుదేశం పార్టీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ ఆ నేతను ఎద్దేవా చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఓ ఛానెల్‌కు ఎస్వీ మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. దానికి సంబంధించి పోస్ట్ చేసిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

sv mohan reddy

ఇంటర్మీడియట్‌లో ఏ కోర్సు చేశారు అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. 'ఇంటర్‌లో మామూలుగా సివిక్స్, సివిల్.. మామూలుగా జనరల్.. అప్పుడు ఎంపీటీసీలు, ఎంపీసీలు ఇవన్నీ లేవు.. జనరల్‌గా ఉండేది ఇంటర్మీడియట్. అప్పుడు ఇంటర్‌లో సీఈసీ లేదు. నేను డిగ్రీకి వచ్చాక సీఈసీ చేశాను' అని ఎస్వీ మోహన్ రెడ్డి బదులిచ్చారు.

దీంతో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి.. బీకాంలో సీఈసీ ఉండదనడంతో.. ఎస్వీ మోహన్ రెడ్డి చెమటలు పట్టి టవల్‌తో తుడుచుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పుడు జలీల్, ఇప్పుడు ఎస్వీ మోహన్, తర్వాత ఇంకెవరు? అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎస్వీ మోహన్ రెడ్డి డిగ్రీ చదువుకుని చాలా రోజులు కావడం వల్ల ఆయన కొంచెం కన్వ్ఫ్యూజ్ అయి ఉంటారేమోనని పలువురు పేర్కొంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Once an MLA said he studied Physics in B.Com and now another MLA made a mess with his degree. Kurnool MLA SV Mohan Reddy in an interview said that he studied CEC (Civics, Economics and Commerce) in Degree.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి