వందే భారత్ ల నుంచి అమృత్ స్టేషన్ల వరకూ-ఈ ఏడాది రైల్వే ఘనతలివే..!
ఈ ఏడాది దక్షిణ మధ్య రైల్వే అద్భుత విజయాలు నమోదు చేసుకుంది. ఇందులో వందే భారత్ రైళ్ల పొడిగింపులతో పాటు టెర్మినళ్ల అభివృద్ధి, అమృత్ భారత్ స్టేషన్ల అప్ గ్రడేషన్లు, నెట్ వర్క్ విస్తరణలు, ప్రత్యేక రైళ్లు నడపటం, కార్గో ఆదాయం పెంచుకోవడం ఇలా పలు అంశాల్లో దక్షిణ మధ్య రైల్వే మేటిగా నిలిచింది. తద్వారా దేశంలోని ఇతర జోన్లతో పోలిస్తే పలు అంశాల్లో మెరుగ్గా నిలిచింది.
ఈ ఏడాది దక్షిణ మధ్య రైల్వే అన్ని రంగాల్లో గణనీయ అభివృద్ధిని సాధించింది. మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రయాణికుల సౌకర్యాలు, కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం, స్టేషన్ల అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, రవాణా సామర్థ్యం పెంపు, ఆదాయం వృద్ధి, భద్రతా చర్యల్లో కొత్త శిఖరాలకు చేరుకుంది. హైదరాబాద్ నగరంలో రైల్వే రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి ఉప టెర్మినల్‌ను ప్రారంభించింది. అలాగే తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వారాంగల్ స్టేషన్లు ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన అమృత్ స్టేషన్లను మే నెలలో ప్రారంభించింది. వీటితో పాటు కాచిగూడ హెరిటేజ్ స్టేషన్‌ను రూ.2.2 కోట్లతో అభివృద్ది చేసింది.

కాచిగూడ-భగత్ కి కోటి రైలు కొత్త రైలును జూలైలో, .తిరుపతి-షిర్డీ రైలు డిసెంబర్ లో ప్రారంభించింది. అలాగే పలు వందే భారత్ లను పొడిగించింది. ఇందులో ముంబై సీఎస్ఎంటీ-జల్నా-నాందేడ్ ఆగస్టులో, చెన్నై-విజయవాడ-నరసాపురం డిసెంబర్ లో పొడిగించారు. అలాగే 2024తో పోలిస్తే.. దక్షిణ మధ్య రైల్వే ఆదాయం పెంచుకుంది. సరకు రవాణాలో 136.2 మిలియన్ టన్నులకు చేరింది. సరకు ఆదాయంలో ₹12,841కోట్లకు చేరింది.ప్రయాణికుల ఆదాయం ₹5,525 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం₹19,314 కోట్లకు చేరింది. ఈ ఏడాది 199 కిలోమీటర్ల ట్రాక్ విస్తరించారు.

ఈ ఏడాది 184 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ విద్యుదీకరణ పూర్తి చేశారు. అలాగే సికింద్రాబాద్ డివిజన్ 100 శాతం విద్యుదీకరణ చేశారు. 529 కి.మీ విస్తీర్ణంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ అమలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బ్లాక్ సిస్టమ్‌లు 9 సెక్షన్లలో అమల చేస్తున్నారు. 68 లెవెల్ క్రాసింగ్ లు రద్దు చేయడంతో పాటు 22 రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు, 60 రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు నిర్మాణ చేపట్టారు. దేశంలోనే అత్యధికంగా ఇక్కడ 52 స్టేషన్లు/భవనాలు జీరో ప్లస్ ఎనర్జీ లేబెలింగ్ గుర్తింపు సాధించాయి.గుంతకల్ డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ ఉత్తమ యూనిట్ అవార్డు అందుకుంది. అలాగే రాయచూర్, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లు సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ సాధించాయి.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications